నాన్ వెజ్ లవర్స్ కు షాక్..కొండెక్కిన చికెన్, మటన్ ధరలు.. కారణాలివే!

తెలంగాణా రాష్ట్రంలో నాన్ వెజ్ ప్రియులకు చేదువార్త. నాన్ వెజ్ తినాలనుకునే వారికి పెరిగిన ధరలు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో చికెన్ మరియు మటన్ ధరలు భారీగా పెరిగి సాధారణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. తీవ్రమైన వేడి, పెళ్లి సీజన్ మరియు సరఫరా తగ్గడం కారణంగా మాంసం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

బాగా పెరిగిన చికెన్ ధరలు

వ్యాపారుల ప్రకారం, గత ఒక వారంలో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల రూ. 260కి అందుబాటులో ఉండే ఒక్క కేజీ డ్రెస్డ్ చికెన్ ప్రస్తుతం రూ.320 నుంచి రూ. 360 వరకు అమ్ముతున్నారు. స్కిన్ లెస్ చికెన్ రూ. 350-రూ. 360కి విక్రయం అవుతోంది. ఫామ్‌లలో లైవ్ చికెన్ కేజీ రూ.170-రూ.180 ఉంది. గుడ్ల ధర కూడా డజన్‌కి రూ.72-రూ.75కి చేరుకుంది.

shock for non veg lovers rates hike for mutton and chicken these are the resongs for rates hike

చికెన్ ధరల పెరుగుదలకు కారణాలు ఇవే

వేసవికాలం కావటంతో వేడి కారణంగా పౌల్ట్రీలలో కోళ్ళు అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఫలితంగా ఫామ్‌లలో ఉత్పత్తి తగ్గుతుంది. మరోవైపు పెళ్లిళ్లు, వేడుకలు, హోటల్స్ లో చికెన్ డిమాండ్ పెరగడంతో సరఫరా-డిమాండ్ అసమతుల్యత ఏర్పడింది. డిమాండ్ కు తగ్గట్టు సప్లై లేకపోవటంతో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి.

భారీగా పెరిగిన మటన్ ధరలు

మటన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. సాధారణ మటన్ కేజీ రూ. 1,100 చుట్టుపక్కల ఉంటే, బోన్‌లెస్ మటన్ రూ. 1,300కి మించి విక్రయం అవుతోంది. వ్యాపారుల అంచనా ప్రకారం జూన్ చివరి వరకు ఈ ధరలు ఉండే అవకాశం ఉంది. దీంతో చాలా మంది వినియోగదారులు మాంసం కొనుగోలును తగ్గించుకుంటున్నారు . మాంసానికి బదులు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు.

సనత్ నగర్ టిమ్స్ లో వైద్య సేవల ట్రయల్ రన్‌.. మంత్రి కీలక ఆదేశాలు
సనత్ నగర్ టిమ్స్ లో వైద్య సేవల ట్రయల్ రన్‌.. మంత్రి కీలక ఆదేశాలు

పెళ్ళిళ్ళ సీజన్ కొనసాగుతున్నందున త్వరలో ధరలు తగ్గే అవకాశాలు

వేసవి వేడి మరియు పెళ్ళిళ్ళ సీజన్ కొనసాగుతున్నందున త్వరలో ధరలు తగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మధ్య తరగతి కుటుంబాలకు చికెన్ కర్రీ లేదా మటన్ బిర్యానీ ఇప్పుడు ఖరీదైన వ్యవహారమనే చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+