తెలంగాణలో ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు, తాజా ఉత్తర్వులు..!!
తెలంగాణలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజా హెచ్చరిక చేసింది. 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇస్తూ కలెక్టర్లు ప్రకటించారు.
రానున్న మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురియ నుండటంతో 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో 6 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో.. అతి భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఈ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జగిత్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో గురువారం విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. దీనికి బదులుగా ఆగస్టు 8వ తేదీన రెండో శనివారం వర్కింగ్ డే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో
కొమురం భీం జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో, ఈ జిల్లాల కలెక్టర్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు. అవసరం లేకుండా పిల్లలను బయటకు పంపవద్దని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు సమాచారం అందించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు వరద పొటెత్తడంతో అధికారులు గేట్ల 85 గేట్లను ఎత్తివేశారు. ఈ సీజన్‌లో తొలిసారిగా జూరాల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలారు.












Click it and Unblock the Notifications