60 కోట్ల ఏళ్ల నాటి నిజం! మన మెదడులోనే మూడో కన్ను?

మన చూపు వెనుక ఒక అద్భుతమైన, వింతైన పరిణామక్రమం ఉందంటే నమ్ముతారా? నేడు రెండు కళ్లతో లోకాన్ని తిలకిస్తున్న మనుషులు, ఇతర క్షీరదాల చూపు వెనుక ఒకే ఒక కన్ను కలిగిన ఒక ప్రాచీన జీవి ఉందనే సంచలన విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 60 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన ఒక చిన్న వానపాము లాంటి జీవి నుంచి మన కళ్లు రూపాంతరం చెందాయని లండ్, సస్సెక్స్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధన మానవ పరిణామ క్రమాన్ని, మెదడు నిర్మాణాన్ని అర్థం చేసుకునే రీతిలోనే ఒక కొత్త సంచలనాన్ని సృష్టించింది.

శత్రువులు లేని కాలంలో పోయిన 'రెండు కళ్లు'!

పరిశోధకుల కథనం ప్రకారం.. 60 కోట్ల ఏళ్ల కిందట సముద్రపు అడుగుభాగంలో స్థిరంగా ఒకే చోట జీవించిన ఒక చిన్న జీవి మనందరికీ మూలపురుషుడు. అంతకంటే ముందు తరాల్లో దానికి రెండు కళ్లు ఉన్నప్పటికీ, సముద్రపు నీటిలోని ప్లవాంగాలను ఆహారంగా తీసుకుంటూ ఒకే చోట నిశ్చలంగా బతికే క్రమంలో ఆ కళ్ల అవసరం తగ్గింది. తరాలు మారే కొద్దీ ఆ రెండు కళ్లు కనుమరుగైపోయాయి. అయితే, కేవలం వెలుతురును మాత్రమే పసిగట్టే కొన్ని కణాల సమూహం దాని తల మధ్యభాగంలో మిగిలిపోయింది. అదే కాలక్రమేణా తల పైభాగంలో ఒకే ఒక్క కన్నుగా మారింది.

Scientists Uncover Origin of Human Eyes Ancient One-Eyed Ancestor Shaped Modern Vertebrate Vision

మళ్లీ స్విమ్మింగ్ స్టార్ట్.. కళ్లు రీ-ఎంట్రీ!

మిలియన్ల సంవత్సరాల తర్వాత, ఆ జీవి యొక్క సంతతి మళ్లీ సముద్రంలో ఈదడం ప్రారంభించింది. వేగంగా కదులుతున్నప్పుడు ఎదురుగా వచ్చే అడ్డంకులు, శత్రువులను పసిగట్టడానికి, ఆహారాన్ని వేటాడేందుకు మళ్లీ చూపు అవసరమైంది. దాంతో, తల మధ్యలో ఉన్న ఆ ఒక్క కన్ను క్రమంగా విభజన చెంది, రెండు వైపులా రూపాంతరం చెందింది. అలా పరిణామ క్రమంలో మళ్లీ రెండు కళ్లు ప్రాణం పోసుకున్నాయి. మిగతా కీటకాలు, సముద్రజీవుల కళ్ల కంటే మనుషుల కళ్ల నిర్మాణం ఎందుకు భిన్నంగా ఉందో చెప్పడానికి ఇదే ప్రధాన ఆధారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మెదడులోనే కళ్ల స్క్రీన్ 'రెటీనా'!

కీటకాల, శంఖు జాతి జీవుల్లో (స్క్విడ్) కళ్లు చర్మపు కణజాలం నుంచి ఏర్పడితే, మనుషులు, వెన్నుముక ఉన్న జీవుల్లో మాత్రం కంటి వెనుక ఉండే 'రెటీనా' నేరుగా మెదడు కణజాలం నుంచే అభివృద్ధి చెందింది. ఈ వింత పరిణామం వల్లే మన కంటి చూపుకు, మెదడులోని నరాల వ్యవస్థకు అంతటి ముడిపడి ఉన్న సంబంధం ఏర్పడింది. మన కన్ను ఒక కెమెరాలా కాంతిని గ్రహించి, క్షణాల్లో మెదడుకు విద్యుత్ సంకేతాలను పంపే అద్భుత వ్యవస్థగా మారింది.

తల లోపల దాక్కున్న 'ప్రాచీన కన్ను'!

ఈ పరిశోధనలో వెల్లడైన అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆనాటి 60 కోట్ల ఏళ్ల నాటి 'ఒకే ఒక్క కన్ను' పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. అది ఇప్పటికీ మన మెదడు లోపల ఒక చిన్న భాగంలో దాగి ఉంది. దాన్నే మనం ప్రస్తుతం 'పీనియల్ గ్లాండ్' అని పిలుస్తున్నాం! మన శరీరంలో నిద్రను, మెలకువను నియంత్రించే 'మెలటోనిన్' అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేసేది ఇదే. వెలుతురు, చీకట్లను పసిగట్టి శరీరాన్ని సమాయత్తం చేసే ఈ గ్రంథి, నాటి 'మూడో కన్ను' శేషభాగమేనని పరిశోధకులు వివరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+