Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Teja Nidamanuru: ఎవరీ తెలుగు"తేజం",కన్నేసిన SRH కావ్యా పాప..?

అది వరల్డ్ కప్‌ క్వాలిఫైయింగ్ మ్యాచ్. వెస్టిండీస్ నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్. అప్పటికే పసికూన నెదర్లాండ్స్ ముందు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది వెస్టిండీస్. పసికూనలు ఏం గెలుస్తారులే అని డచ్ టీమ్‌ను తక్కువగా అంచనా వేశారు. కానీ ఇది క్రికెట్ బాసూ ఏ బంతికి ఎలాంటి అద్భుతం జరుగుతుందో చెప్పలేం. అలాంటి అద్భుతమే నెదర్లాండ్స్‌లో జరిగింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌ వరకు వెళ్లినప్పటికీ.. అంతకుముందు మ్యాచ్ టై అవడానికి డచ్ టీమ్ తరపున వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడిన తెలుగు కుర్రాడు నిడమనూరు తేజా కారణం. ఇంతకీ ఎవరు ఈ తేజా.. ఏమిటి ఇతని నేపథ్యం..?

ఎవరీ తేజా నిడమనూరు..?
కరేబియన్ జట్టు విధించిన 375 పరుగులను చేధించే క్రమంలో నెదర్లాండ్స్ జట్టు చతికిలపడింది. సరిగ్గా అప్పుడే ఎంటర్ అయ్యాడు మన తెలుగు తేజాం తేజా. 22వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన తేజా 46వ ఓవర్ వరకు క్రీజ్‌లో ఉండి 76 బంతుల్లో 111 పరగులు చేశాడు. ఒక్కసారిగా ఓవర్‌ నైట్ స్టార్‌గా మారాడు. దీంతో నెటిజెన్లు తేజా ఎవరు అంటూ ఇంటర్నెట్‌లో వెతకటం ప్రారంభించారు.

తేజా నిడమనూరు.. ఈ పేరులోనే తెలిసిపోతుంది ఈ కుర్రాడు తెలుగువాడని. ఇతని సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. 1994 ఆగష్టు 22న జన్మించిన ఇతని పూర్తి పేరు అనిల్ తేజాా నిడమనూరు. బాల్యంలోనే తన కుటుంబం విజయవాడ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడే క్రికెట్ పాఠాలు నేర్చుకున్న తేజా.. ఆక్లాండ్ జట్టు తరపున డొమెస్టిక్ క్రికెట్‌ ఆడాడాడు.అయితే న్యూజిలాండ్ కుర్రాడు నెదర్లాండ్స్‌ జట్టుకు ఎలా ఆడాడనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నా.

ఇండియా టూ నెదర్లాండ్స్ వయా న్యూజిలాండ్
భారత్‌లో పుట్టిన కుర్రాడు నెదర్లాండ్స్‌కు వయా న్యూజిలాండ్‌ ద్వారా చేరుకున్నాడు. న్యూజిలాండ్‌లో చదువుకున్న తేజాకు.. డచ్‌ దేశంలో ఉద్యోగం వచ్చింది. న్యూజిలాండ్ నుంచి నెదర్లాండ్స్‌కు వచ్చినప్పటికీ తను ఎంతగానో ఇష్టపడే క్రికెట్‌ను మాత్రం మరువలేదు.దీంతో డచ్‌లోని ఉట్రెక్ట్‌లోని కంపాంగ్ క్లబ్‌లో జాయిన్ అయ్యాడు.ఇలా డచ్‌ దేశవాళీ క్రికెట్ ఆడుతున్న తేజాకు ఒక్కసారిగా ఆ దేశం తరుపున ఆడాల్సిందిగా పిలుపొచ్చింది.

Teja Nidamanuru:

కుర్రాడి కోసం పోటీపడ్డ క్రికెట్ క్లబ్స్
నెదర్లాండ్స్ తరపున మంచి ప్రదర్శన కనబరుస్తున్న తేజాపై ఇతర దేశాలకు చెందిన క్రికెట్ క్లబ్స్‌ కళ్లు పడ్డాయి. ఈ కుర్రాడి కోసం పోటీపడ్డాయి. దీంతో ఇంగ్లాండ్‌లో క్లబ్ కోసం తేజా ఆడటం ప్రారంభించాడు. ఇక్కడే ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ టిమ్‌ డేవిడ్‌తో పరిచయమైంది. ఇద్దరూ ఒకే క్రికెట్ క్లబ్‌ కోసం ప్రాతినిథ్యం వహించారు.తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ కంటే ముందు అదే వెస్టిండీస్‌తో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తేజా... తొలి మ్యాచ్‌లోనే అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు.ఆ మ్యాచ్ నెదర్లాండ్స్ ఓడినప్పటికీ తన బ్యాటింగ్‌తో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు తేజా.

Teja Nidamanuru:

వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్ జట్టు జింబాబ్వేతో మూడు వన్డేల సీడబ్ల్యూసీ సూపర్ లీగ్ సిరీస్ ఆడింది. అందులో తొలి వన్డేలో 110 బంతుల్లో 96 పరుగులు చేసి డచ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు తేజాా. 250 పరుగుల టార్గెట్ విధించిన జింబాబ్వే తప్పక గెలుస్తారని భావించారు. కానీ 7వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన తేజాా జట్టును గెలిపించి అందరి అంచనాలను తలకిందులు చేశాడు. దీంతో ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అంతటి స్కోరు చేసిన వారిలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, అబ్దుల్ రజాక్‌ల రికార్డులను తేజాా చెరిపివేశాడు.

 Teja Nidamanuru

తేజా పై కావ్య పాప గురి:
వెస్టిండీస్‌పై సెంచరీతో తేజాా కదం తొక్కడంతో అందరి కళ్లు ఈ కుర్రాడిపై పడ్డాయి. ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఈ కుర్రాడి గురించి ఆరా తీస్తున్నాయి. ఎంత డబ్బు అయినా సరే ఈ కుర్రాడిపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ జట్టు యజమాని కావ్యాపాప తేజాాను ఎలాగైనా సరే కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.ఇక సన్‌రైజర్స్‌తో పాటు బడా ఫ్రాంఛైజీలు కూడా తేజాా వెంటపడుతున్నట్లు సమాచారం. ఇక తెలుగు తేజాం తేజాాకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+