వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా చెక్‌పోస్ట్‌పై తెలంగాణవాదుల దాడి, తిరగబడ్డారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana activists attack on Check post
ఖమ్మం: ఆంధ్ర అబ్కారీ అధికారులు ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం నెల్లిపాక గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుపై శనివారం సాయంత్రం తెలంగాణవాదులు దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు పైన మండిపడ్డారు. సంఘటన జరుగుతున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న పలువురు నెల్లిపాక గ్రామస్థులు ఆందోళనకారులపై తిరగబడ్డారట.

ఆర్డినెన్స్ కారణంగా ముంపునకు గురయ్యే ఏడు మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలిపివేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు బస్‌పాస్‌లు, స్కాలర్‌షిప్‌లు, రైతులకు విత్తనాలు, రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలను నిలుపుదల చేస్తే మీరేం చేస్తున్నారని నిలదీశారు.

కనీసం మద్యం దుకాణాలకు సైతం తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయనపుడు నిరసన తెలపని తెలంగాణవాదులు, ఇప్పుడు ఏవిధంగా చెక్‌పోస్టును ధ్వంసం చేశారని తిరగబడ్డారు. దీంతో తెలంగాణవాదులు, నెల్లిపాక గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం దాడులకు దిగారు.

రోడ్డుపై ఇరువర్గాలు బైఠాయించి ధర్నా చేయడంతో గంటన్నరపాటు వాహనాలన్నీ నిలిచిపోయాయి. వివరాలు తెలుసుకున్న భద్రాచలం రూరల్ ఎస్‌ఐ శ్రీనివాస్ హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. ఆంధ్రా ఆబ్కారీ అధికారి నుంచి ఎస్‌ఐ శ్రీనివాస్ పూర్తి వివరాలు సేకరించారు. ఈ సమయంలో నెల్లిపాకవాసులు కొందరు ఆంధ్ర పోలీసులే రావాలంటూ నినాదాలు చేశారట.

అంతేకాకుండా.. చాలామంది గ్రామస్తులు భద్రాచలంతోనే అనుబంధం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆర్డినెన్స్‌తో తమ పిల్లలకు బస్‌పాసులూ ఇవ్వని దయనీయ పరిస్థితి ఏర్పడిందని, రెవన్యూ అధికారులు తమకు సహకరించకపోగా, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే అంటున్నారని విచారం వ్యక్తం చేశారు.

కాగా, ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఇచ్చిన 72 గంటల ఆంధ్రా బస్సుల బంద్‌ తొలిరోజు విజయవంతమైంది. దీంతో భద్రాచలం నుంచి ఆంధ్రాకకు, ఆంధ్రా నుంచి భద్రాచలానికి సర్వీసులు నడవలేదు. వెంటనే అఖిలపక్షం ఏర్పాటుచేసి పోలవరం ఆర్డినెన్స్‌పై అన్ని రాజకీయపక్షాల అభిప్రాయాలను తీసుకుని కేంద్రానికి పంపాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

English summary
Telangana activists attack on Check post in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X