తెలంగాణ బంద్ విజయవంతం: ఆందోళనలు(పిక్చర్స్)

హైదరాబాద్: లోకసభలో పోలవరం బిల్లు ఆమోదానికి నిరసనగా తెలంగాణ రాజకీయ జెఏసి, వామపక్షాలు, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మెదక్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ డిపోల ఎదుట తెలంగాణ జెఏసి, కాంగ్రెస్, సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ నగరంలో పలు లోకల్ ఆర్టీసి బస్సులు తిరిగాయి.

కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, సిపిఎం నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగింది. మొత్తం 600 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నల్గొండ జిల్లాలో తెలంగాణ బంద్ నేపథ్యంలో డిపోల ఎదుట టిఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మిర్యాలగూడ బస్టాండ్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి.

తెలంగాణ బంద్

తెలంగాణ బంద్

లోకసభలో పోలవరం బిల్లు ఆమోదానికి నిరసనగా తెలంగాణ రాజకీయ జెఏసి, వామపక్షాలు, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

తెలంగాణ బంద్

తెలంగాణ బంద్

కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, సిపిఐ, సిపిఎం, టి జెఏసి నాయకులు ఆందోళనలు నిర్వహించారు.

తెలంగాణ బంద్

తెలంగాణ బంద్

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహించిన ధర్నాలో టి జెఏసి ఛైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదీవాసులను ముంచి ప్రాజెక్టు కడతామంటే వూరుకునేది లేదని అన్నారు.

తెలంగాణ బంద్

తెలంగాణ బంద్

కాంగ్రాక్టర్లకు రూ. 20వేల కోట్లు పంచేందుకే పోలవరం నిర్మాణమని అన్నారు. తాగు, సాగునీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. 7 మండలాలను ఏపిలో కలిపి న్యాయం చేస్తామంటే ఎలా అని కోదండరాం ప్రశ్నించారు.

తెలంగాణ బంద్

తెలంగాణ బంద్

సిపిఐ(ఎంఎల్) హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు.

తెలంగాణ బంద్

తెలంగాణ బంద్

రెండున్నర లక్షల మంది గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మందబలంతో చట్టం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, తక్షణమే ఆ చట్టాన్ని రద్దు చేయాలని నాయకులు ఝాన్సీ, గౌతమ్ ప్రసాద్, పద్మ, అరుణ, సత్య, రాజేందర్, పుష్పలు డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ డిపో ఎదుట టిజెఏసి నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. తెలంగాణ బంద్‌కు మద్దతుగా సికింద్రాబాద్‌లోని జూబ్లీబస్‌స్టాండ్ ఎదుట సిపిఎంఎల్ ధర్నా నిర్వహించింది. కరీంనగర్ జిల్లాలో 11 డిపోల్లో 950 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో తెలంగాణ బంద్‌కు మద్దతుగా మహబూబాబాద్‌లో సిపిఎం భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి చౌరస్తాలో ప్రధాని మోడీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను సిపిఐ నేతలు దహనం చేశారు.

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహించిన ధర్నాలో టి జెఏసి ఛైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదీవాసులను ముంచి ప్రాజెక్టు కడతామంటే వూరుకునేది లేదని అన్నారు. కాంగ్రాక్టర్లకు రూ. 20వేల కోట్లు పంచేందుకే పోలవరం నిర్మాణమని అన్నారు. తాగు, సాగునీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. 7 మండలాలను ఏపిలో కలిపి న్యాయం చేస్తామంటే ఎలా అని కోదండరాం ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+