కొద్ది గంటల్లో అసెంబ్లీకి టి బిల్లు?: విప్ జారీకి అవకాశం

మరోవైపు బిల్లు నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ విప్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును సాఫీగా గట్టెక్కించేందుకు అధిష్టానం సూచనల మేరకు విప్ జారీ చేసే అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కుదరకపోతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టే అవకాశముందని చెప్పారు.
రాష్ట్రానికి తెలంగాణ బిల్లు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరించాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావులు కోరారు. అరవయ్యేళ్ల తెలంగాణ కల సాకారమవుతోందన్నారు. మరోవైపు అసెంబ్లీలో సమైక్యాంధ్రపై తీర్మానం చేయాలని, వచ్చిన ప్రత్యేక విమానంలోనే తెలంగాణ బిల్లును వెనక్కి పంపించాలని పయ్యావుల కేశవ్ అన్నారు.
గవర్నర్‌తో డిగ్గీ భేటీ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications