టీ బిల్లు: స్వీట్లు తిన్నారు, అరుణ నవ్వులు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ బిల్లును గురువారం లోకసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణకు చెందిన మంత్రులు, వివిధ పార్టీల శానససభ్యులు పండుగ చేసుకున్నారు. తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు ఉత్సాహంగా, స్వీట్లు పంచుకున్నారు. పరస్పరం తినిపించుకున్నారు. తెలంగాణ శాసనసభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు స్వీట్లు పంచిపెట్టుకున్నారు.

తెలంగాణకు చెందిన మంత్రి డికె అరుణ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

ఈ సమావేశాల్లో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గొడవ మధ్యనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదించి, ఆమోదింపజేసుకున్నారు. తెలంగాణ శాసనసభ్యులు సభా కార్యక్రమాలు నిత్యం అడ్డుపడుతూ వచ్చారు.

ఈటెల రాజేందర్‌తో డికె అరుణ

ఈటెల రాజేందర్‌తో డికె అరుణ

తెలంగాణకు చెందిన మంత్రి డికె అరుణ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌తో నవ్వులు పంచుకున్నారు. minister Aruna with trs

తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు..

తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు..

మంత్రి డికె అరుణతో పాటు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలా...

హరీష్ రావుతో చేతులు కలుపుతూ...

హరీష్ రావుతో చేతులు కలుపుతూ...

తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావుతో ఆనందాన్ని పంచుకుంటూ మంత్రి డికె అరుణ

నవ్వులు రువ్వుతూ...

నవ్వులు రువ్వుతూ...

తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో డికె అరుణ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.

స్వీట్లు తినిపించుకుంటూ...

స్వీట్లు తినిపించుకుంటూ...

తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన ఆనందంలో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి తదితరులు స్వీట్లు తినిపించుకుంటూ ఇలా..

నోరు తీపి చేసుకున్నారు..

నోరు తీపి చేసుకున్నారు..

మోత్కుపల్లి నర్సింహులు సహా తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు స్వీట్లతో నోరు తీపి చేసుకున్నారు.

టిడిపి మహిళా ఎమ్మెల్యేలు...

టిడిపి మహిళా ఎమ్మెల్యేలు...

ఉమా మాధవరెడ్డి సహా తెలుగుదేశం తెలంగాణ ప్రాంత మహిళా శాసనసభ్యులు స్వీట్లు తినిపించుకుంటూ ఇలా ఆనందాన్ని పంచుకున్నారు.

గుడ్ బై టు ఎపి అసెంబ్లీ

గుడ్ బై టు ఎపి అసెంబ్లీ

తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు గుడ్ బై టూ ఎపి అసెంబ్లీ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.

జై తెలంగాణ నినాదాలు

జై తెలంగాణ నినాదాలు

మంత్రి డికె అరుణ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీ ఆవరణలో జై తెలంగాణ నినాదాలు చేశారు.

టిడిపి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు..

టిడిపి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు..

తెలంగాణ బిల్లును లోకసభలో ప్రతిపాదించిన నేపథ్యంలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఇలా..

ప్రత్యేక తెలంగాణకు స్వాగతం..

ప్రత్యేక తెలంగాణకు స్వాగతం..

తెలంగాణ బిల్లును లోకసభలో ప్రతిపాదించిన నేపథ్యంలో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రత్యేక తెలంగాణకు స్వాగతమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ముగ్గురు రాజీనామా...

ముగ్గురు రాజీనామా...

తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెసుకు చెందిన ముగ్గురు శాసనసభ్యులు రాజీనామా చేశారు.

సిపిఐ సభ్యులు కూడా..

సిపిఐ సభ్యులు కూడా..

తెలంగాణ బిల్లును లోకసభలో ప్రతిపాదించిన నేపథ్యంలో సిపిఐ శాసనసభ్యులు కూడా విజయానందం చేశారు.

సిపిఐ సభ్యులతో పాటు సిపిఎం సభ్యుడు

సిపిఐ సభ్యులతో పాటు సిపిఎం సభ్యుడు

సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి సిపిఐ సభ్యులతో పాటు ఇలా కనిపించారు. తెలంగాణలోని మిర్యాలగుడా నుంచి జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యారు. సిపిఎం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది.

ఈటెలతో గుండా మల్లేష్

ఈటెలతో గుండా మల్లేష్

తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో సిపిఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+