పరిష్కరిస్తాం, హైదరాబాద్ కేంద్రంగా: టాలీవుడ్‌పై కేటీఆర్

హైదరాబాద్: భారత చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాదు కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిలిం సిటీని నిర్మిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.

దేశంలో తెలుగు సినీ పరిశ్రమ అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పరిశ్రమకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. రెండు వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఫిలిం సిటీని నిర్మిస్తామని చెప్పారు.

Telangana to build international style film city: KTR

హామీలు అమలు చేస్తాం: రాజయ్య

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. లక్షలమంది రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. రుణమాఫీపై ఆర్బీఐతో చర్చించేందుకు అధికారులు ముంబై వెళ్లారని తెలిపారు. 22వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు.

కేసీఆర్‌పై నారాయణ ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ సోమవారం మండిపడ్డారు. గతంలో ఒకలా వ్యవహరించిన కేసీఆర్... అధికారంలోకి రాగానే మరోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఐలమ్మ, కొమరయ్యలను పొగిడినవారు... ఇప్పుడు వారి గురించి మాట్లాడటం కూడా మానేశారన్నారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+