అశ్లీల వెబ్‌సైట్లకు షాక్: 1400 పోర్న్ సైట్లపై తెలంగాణ సీఐడీ కేసు
హైదరాబాద్: 1400 అశ్లీ వెబ్‌సైట్‌ల పైన తెలంగాణ రాష్ట్ర సీఐడీ కేసు నమోదు చేసింది. వీటితోపాటు సదరు సైట్లకు అనుబంధంగా ఉన్న వేలాది సైట్లను మూసివేయించేందుకు తెలంగాణ రాష్ట్ర సీఐడీ చర్యలను ప్రారంభించింది.
ఇలాంటి సైట్లను మూసివేయించాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, దీని పైన చట్టబద్ధమైన ప్రక్రియ ఇంతవరకు ఎవరు ప్రారంభంచలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఐడీ పద్నాలుగు వందల అశ్లీల వెబ్ సైట్ల పైన కేసు మోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల వెబ్ సైట్లు ఉన్నప్పటికీ వాటన్నింటికి మూలంగా ఉండే పద్నాలుగు వందల సైట్లను అధికారులు గుర్తించారు. ఓ సైట్ తెరిస్తే దానికి అనుబంధంగా ఉన్న సైట్లు పదుల సంఖ్యలో వస్తాయి. అందుకే, ఈ సైట్లను మూసివేయిస్తే మిగతావి దాదాపు వాటంతట అవే ఆగిపోతాయని భావిస్తున్నారు.

వారు పద్నాలుగు వందల సైట్ల పైన కేసు నమోదు చేశారు. భారతీయ సమాచార చట్టం ప్రకారం ఏ వెబ్ సైట్‌ను అయినా మూసివేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే, అందుకు కారణాలు చూపించాల్సి ఉంటుంది.
దీనిని అసరాగా చేసుకున్న సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి, ఈ సైట్ల వల్ల తలెత్తుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సదరు సైట్లను మూసివేయించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం నుండి ఆదేశాలు వెలువడితే, ఆ ఆదేశాలని కేంద్రానికి పంపిస్తారు.












Click it and Unblock the Notifications