దుర్గమ్మతల్లికి కేసీఆర్ మొక్కు: 57 వజ్రాలు, పాలపిట్టతో ముక్కుపుడక

Recommended Video

    కేసీఆర్ బెజవాడ దుర్గమ్మకు బంగారు ముక్కు పుడక సమర్పణ

    విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి సమర్పించిన ముక్కు పుడక గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ ముక్కుపుడకలో పాలపిట్ట, చెట్టుకొమ్మ వచ్చేలా చేశారు. పాలపిట్ట, చెట్టుకొమ్మ (జమ్మిచెట్టు) అంటే దసరా. దసరా అమ్మవారి పండుగ. ఇక ఈ ముక్కు పడకలో 57 వజ్రాలు పొందుపర్చారు. ఈ ముక్కు పుడక అర్ధచంద్రాకారంలో ఉంది. దీని బరువు 11.29 గ్రాములు.

    తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్వాగతం పలికారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయ్‌తో దుర్గగుడికి చేరుకున్నారు.

    Telangana CM KCR offers nose stud to Kanaka Durga temple in Vijayawada

    కేసీఆర్ వెంట ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తెలంగాణ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎంపీ కే కేశవ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలు ఉన్నారు. దుర్గగుడిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడికి వచ్చిన కేసీఆర్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+