వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోస్తీ: షా కొడుకు రిసెప్షన్‌లో కేసీఆర్, గులాబీ అధిపతికి మోడీ గ్రీటింగ్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నాడు (ఫిబ్రవరి 17) కేసీఆర్ పుట్టిన రోజు. సోమవారం సాయంత్రం కేసీఆర్ ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు కేసీఆర్ 61పడిలోకి అడుగు పెడుతున్నారు.

రాష్ట్రం వచ్చాక తొలి పుట్టిన రోజుకు తెలంగాణ బయట కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక... తన తొలి పుట్టిన రోజు నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం బయట ఉన్నారు. కేసీఆర్ సోమవారం నాడు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన తొలి పుట్టిన రోజున రాష్ట్రం బయట ఉంటున్నారు.

కాగా, ఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనయుడి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆయన రిసెప్షన్ వేడుక సోమవారం జరిగింది. ఈ రిసెప్షన్‌లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

Telangana CM KCR will miss first birthday fest in state

కేసీఆర్‌కు బహుమతిగా పాట!

కేసీఆర్ పుట్టిన రోజును మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు తెరాస శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. తన పుట్టిన రోజు నాడు కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఉంటారు. తెరాస నాయకులు మాత్రం తెలంగాణ భవన్‌లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు, రెండు రాష్ట్రాల మధ్య పవర్ గ్రిడ్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మంగళవారం సమావేశం అవుతారు.

మంగళవారం ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 61 కేజీల కేక్‌ను కట్ చేయనున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు యన్ శంకర్ కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఒక పాటను బహుమతిగా అందజేయనున్నారు. అహింసా మార్గంలో తెలంగాణ సాధించిన కెసిఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని బందూక్ సినిమాలోని ఈ పాటను మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆవిష్కరిస్తారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao will miss his first birthday celebrations in the new state and also Sivaratri as he will be in Mumbai on Tuesday to meet his Maharashtra counterpart Devendra Fadnavis on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X