ఏపీలో కాంగ్రెస్ సభకు సీఎం రేవంత్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జగన్ సింగిల్ గానే పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ షర్మిలకు పగ్గాలు అప్పగించి..పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. షర్మిల కు మద్దతుగా ఏపీలో ఎన్నికల కీలక సభకు తెలంగాణ సీఎం రేవంత్ హాజరు కానున్నారు.

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వెళ్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. చాలా కాలం తరువాత ఏపీలో కాంగ్రెస్ వరుస సభలు నిర్వహిస్తోంది. తాజాగా నిర్వహించిన సభలో ఏపీకి ప్రత్యేక హోదా డిక్లరేషన్ పార్టీ ప్రకటించింది. మరో వైపు పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్దులను దరఖాస్తులు స్వీకరించారు. దీంతో, అభ్యర్దుల ఎంపిక పైన పార్టీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన పేర్లను కేంద్ర కమిటీకి సిఫార్సు చేయనున్నారు. భారీ సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తు చేసారు. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణ లో గ్యారంటీల హామీలుగా ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. ఏపీలోనూ ఇదే తరహాలో మేనిఫెస్టో ప్రకటనకు పార్టీ సిద్దం అవుతోంది.

Telangana CM REvanth to attend congress meeting in Guntur on 7th of this month

ఎన్నికల షెడ్యూల్ వచ్చే వారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ లోగానే పార్టీ వరుస సభల నిర్వహణకు నిర్ణయించింది. ఈ నెల 7న గుంటూరు వేదికగా కాంగ్రెస్ భారీ సభకు ప్లాన్ చేస్తోంది. ఈ సభకు పీసీసీ చీఫ్ షర్మిలతో పాటుగా తెలంగాణ సీఎం రేవంత్ హాజరు కానున్నారని పార్టీ నేతలు వెల్లడించారు ఈ సభలో కాంగ్రెస్ పార్టీ ఏపీ కోసం ఎలాంటి నిర్ణయాలు అమలు చేయనుందీ.. పార్టీ విధి విధానాలు ఏంటనేది స్పష్టత ఇవ్వనున్నారు. అదే విధంగా పార్టీ మేనిఫెస్టోలోనూ గ్యారంటీలను ప్రకటించటంతో పాటుగా ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మేనిఫెస్టో, గ్యారంటీల ప్రకటనకు తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ఏపీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+