విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్ - రాహుల్ కొత్త టాస్క్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. జగన్ ను ఓడించే లక్ష్యంతో టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఈ సమయంలోనే ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. షర్మిల పీసీసీ చీఫ్ గా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. షర్మిలతో పాటుగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల్లో రేవంత్ కు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. దీంతో, ఎన్నికల వేళ ఏపీలో రేవంత్ అడుగు పెడుతున్నారు.

కాంగెస్ తిరిగి ఏపీలో బలోపేతం కావటం పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగానే షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయటానికి పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తు చేసారు. వీరి అభ్యర్దిత్వం పైన వచ్చే వారం నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో ఏపీలో రాజధాని వ్యవహారం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పైన మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ రాష్ట్రంలో వరుస సభలకు ప్లాన్ చేసింది. ఇప్పటికే ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించింది. ఇక, గుంటూరులో రాజధాని అమరావతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ సభలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు.

Telangana CM Revanth to attend Congress public meeing in Vizag ahead AP Assembly Eelctions

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11న విశాఖలో బహరంగ సభ నిర్వహించనున్నారు. విశాఖ సభకు తెలంగాణ సీఎం రేవంత్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రకటన చేసేలా నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ తొలి సారి ఏపీకి వస్తున్నారు. రాజకీయ సభలో పాల్గొంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఈ సభలో కేంద్రంతో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీంతో, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. రేవంత్ పర్యటన ఖరారైందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+