కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు, ఉద్రిక్తత (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ కానిస్టేబుల్ శానససభ ఆవరణలోని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) కార్యాలయం వద్ద జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్ర చేస్తున్నారని, వాటిని ఎండగట్టాలని ఆయన నివాదాలు చేశారు.
సంజీవులును పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు తీసుకుని వెళ్లారు. సంజీవులును అదుపులోకి తీసుకోవడంపై తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించారు. సంజీవులును వదిలేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి సిఎల్‌పి కార్యాలయం వద్ద బైఠాయించారు.
ఇది ఆరంభం మాత్రమేనని, ఉద్యమం ఇంకా తీవ్రంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. పోలీసుల్లో కూడా తిరుగుబాటు తప్పదని ఆయన అన్నారు. తెలంగామ పోలీసులు కూడా సీమాంధ్ర సర్కారుపై తిరుగుబాటు చేస్తారని ఆయన అన్నారు.

పోలీస్ జై తెలంగాణ
శాసనసభ ఆవరణలోని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం (సిఎల్పీ) వద్ద సంజీవులు అనే తెలంగాణ కానిస్టేబుల్ జై తెలంగాణ అంటూ నినదించారు. ఆ సమయంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీసు తెలంగాణపై చర్చించేందుకు సమావేశమయ్యారు.

ఉద్రిక్త వాతావరణం
ఊహించని రీతిలో కానిస్టేబుల్ సంజీవులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మీడియా ఫోటోగ్రాఫర్ల కెమెరాలు అటు వైపు తిరిగాయి.

సిఎం అంటే తప్పు లేదా..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర అంటే తప్పు లేదా గానీ సంజీవులు జై తెలంగాణ అంటే తప్పా అని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ప్రశ్నించారు. సంజీవులును విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలీసుల అదుపులో సంజీవులు..
జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్ సంజీవులును ఇతర పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు తీసుకుని వెళ్లారు.

కుట్ర చేస్తున్నారని ఆరోపణ..
తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్రులు కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రలను తిప్పి కొట్టాలని సంజీవులు నినాదాలు చేశారు.

అదుపులోకి తీసుకుని తరలించారు
జై తెలంగాణ నినాదాలు చేసిన సంజీవులును పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్లారు.

వదిలిపెట్టారు...
సంజీవులు వదిలిపెట్టాలని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. దాంతో ఆయనను వదిలేశారు.

పొంగులేటి సుధాకర్ రెడ్డి..
ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇలా కనిపించారు.

గండ్ర బైఠాయింపు..
కానిస్టేబుల్ సంజీవులును అదుపులోకి తీసుకోవడాన్ని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి నిరసించారు. ఆయనను వదిలేయాలని గండ్ర అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో సంజీవులును పోలీసులు వదిలేశారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications