Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీరూ బాధ్యులే!: షాకిచ్చిన కేసీఆర్‌పై భగ్గు, సైనికుడినని కడియం

హైదరాబాద్: డాక్టర్ రాజయ్య బర్తరఫ్ నేపథ్యంలో ఆయన అనుచరులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తోందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితిని వీడాలని రాజయ్య పైన వారు ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది.

కేబినెట్ నుండి రాజయ్యను బర్తరఫ్ చేయడం తీవ్ర అవమానమని, అది దళితులను అవమానించడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. భగ్గుమంటున్నారు. తెరాసలో కొనసాగవద్దని కోరుతున్నారని తెలుస్తోంది. అయితే, ఇది సరైన సమయం కాదని వారిని రాజయ్య బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

K Chandrasekhar Rao

రాజయ్య బర్తరఫ్ పైన విపక్షాల మండిపాటు

రాజయ్య బర్తరఫ్ నేపథ్యంలో విపక్షాలు కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దళితులకు ఓ నీతి, దొరలకు మరో నీతి అంటు ధ్వజమెత్తారు. అప్పుడు కడియంకు చెక్ చెప్పేందుకు రాజయ్యను, రాజయ్యకు చెక్ చెప్పేందుకు కడియంను అందలమెక్కిస్తున్నారని ఆరోపించారు.

స్వైన్ ఫ్లూకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యత ఎంత ఉందో, మున్సిపల్ శాఖ బాధ్యత అంతేనని, మున్సిపల్ శాఖ కేసీఆర్ వద్దే ఉందని, ఈ నేపథ్యంలో సీఎం తన పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

కేసీఆర్ దళిత వ్యతిరేకి అని సతీష్ మాదిగ ధ్వజమెత్తారు. రాజయ్యను బర్తరఫ్ చేయడం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని చెప్పేందుకు నిదర్శనమన్నారు. పించన్లు అందక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రి పోచారం, కేటీఆర్‌ను ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రశ్నించారు.

కేసీఆర్ ఆదేశాలతో సైనికుడిలా పని చేస్తా: కడియం

తెలంగాణ పునర్నిర్మాణంలో తాను భాగస్వామిని అవుతానని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సైనికుడిలా పని చేస్తానని మంత్రి కడియం శ్రీహరి ప్రమాణ స్వీకారం అనంతరం చెప్పారు. రాష్ట్ర మంత్రిగా సీఎం ఆశీస్సులతో ప్రమాణం చేశానన్నారు. రాజయ్యను బర్తరఫ్ చేసి ఆయన స్థానంలో కడియం శ్రీహరిని తీసుకున్న విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+