తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు: అసెంబ్లీలో ఏమవుతుంది?

న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర శాసనసభకు వస్తే ఏమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుపై ఓటింగు జరుగుతుందా, జరిగితే బిల్లు ఓడిపోతుందా, ఓడిపోతే ఏమవుతుంది వంటి ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ బిల్లును ఓడించాలని ఎపిఎన్జీవోల నాయకుడు పి. అశోక్ బాబు సీమాంధ్ర శాసనసభ్యులను కోరుతున్నారు. బిల్లును ఓడించి తీరుతామని శాసనసభ్యులు అంటున్నారు. బిల్లును ఓడించడానికే తాము శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేయడం లేదని అంటున్నారు.

ఇదిలావుంటే, జార్ఖంఢ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ విభజనకు అనుసరించిన ప్రక్రియనే ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అనుసరించాలని, రాజ్యాంగ ప్రక్రియను అవలంబించాలని ముఖ్యమంత్రి కిరణ్ పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్ఠానానికి, కేంద్రానికి లేఖలు కూడా రాస్తానని ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన తెలిపారు. తీర్మానాన్ని ఓడించి తీరుతామని కూడా చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ కూడా అసెంబ్లీకి తీర్మానం, బిల్లు రెండూ వస్తాయని తెలిపారు. షిండే మాత్రం బిల్లు మాత్రమే పంపిస్తామని ప్రకటించారు. నవంబర్ 5వ తేదీన శాసనసభకు తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తుందని అంటున్నారు.

Telangana draft bill

ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే - తీర్మానం అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవని, ఏకంగా ముసాయిదా బిల్లే అసెంబ్లీకి వస్తుందని అర్థమవుతోంది. నిజానికి, ముసాయిదా బిల్లుపై అధికారికంగా ఓటింగ్ జరగదు. సభ్యుల అభిప్రాయాలు మాత్రమే రికార్డు అవుతాయి. మొత్తం సభ్యులంతా మాట్లాడితే... ఎంతమంది అనుకూలంగా మాట్లాడారు? ఎందరు వ్యతిరేకంగా మాట్లాడారు? ఎందరు తటస్థంగా ఉన్నారు? అనే వివరాలను రికార్డు చేసి రాష్ట్రపతికి పంపిస్తారు. సభ్యులు వ్యక్తిగతంగా అభిప్రాయాలను వెలిబుచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా కొన్ని సవరణలను ప్రతిపాదించే అవకాశముంది.

కేంద్రం నుంచి వచ్చిన ఏ బిల్లుకైనా సవరణలను ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. వాటిని పరిగణనలోకి తీసుకోవాలా, వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. చట్టపరంగా ఉన్న ఈ అధికారాన్ని ఉపయోగించుకుని ముసాయిదా బిల్లుకు సవరణలు ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సోమవారం ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలవనున్నట్లు తెలిసింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచే గవర్నర్‌కు పిలుపు అందినట్లు సమాచారం. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తదితరులను ఆయన కలిసే అవకాశం ఉంది.

వచ్చేనెల 5న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వస్తున్నారు. సర్దార్ వల్లభ్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగే ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొంటారు. నిజానికి, యేటా ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి హాజరు కావడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి స్వయంగా రాష్ట్రపతి రావడం విశేషం. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+