చంద్రబాబు ఆఫీసు నిర్వహణకు ఆర్ అండ్ బీ నో

హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పనులను హైదరాబాదులో చేయడానికి రోడ్లు, భవనాల శాఖ నిరాకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి క్యాంప్ ఆఫీసుగా కేటాయించిన లేక్ వ్యూ అతిథి గృహం నిర్వహణకు కూడా ఆ శాఖాధికారులు అంగీకరించడం లేదు. తను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాల పనులను చూడలేమని తెగేసి చెబుతున్నారు.

హైదరాబాద్ రోడ్లు భవనాల శాఖకు ఒక కార్యాలయం మాత్రమే ఉంది. ఇది హైదరాబాదులోని ప్రభుత్వ అతిథి గృహాలను నిర్వహిస్తుంది. ఆ కార్యాలయాన్ని విభజనలో తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాదులో ఓ చీఫ్ ఇంజనీర్ మాత్రమే ఉన్నాడు. దాంతో చంద్రబాబు ఆఫీస్ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలంగాణ అధికారులను కోరారు.

Telangana gives short shrift to Chandrababu Naidu’s office

అయితే, తెలంగాణ ఆర్ అండ్ బి అధికారులు అందుకు అంగీకరించడం లేదు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధాని కాబట్టి ఇక్కడి అతిథి గృహాల నిర్వహణ బాధ్యతను తెలంగాణ అధికారులు చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు అంటున్నారు.

తెలంగాణ ఆర్ అండ్ బి కార్యాలయం అందుకు అంగీకరించకపోవడంతో సీమాంధ్ర జిల్లాల నుంచి అధికారులను రప్పించే ఏర్పాట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+