ఇక తెలంగాణలో అశ్లీల వెబ్‌సైట్లు కనిపించవు!

Telangana government to ban porn sites
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నెట్‌లో లభిస్తున్న అశ్లీలతకు కళ్లెం వేయాలని నిర్ణయించింది. మహిళలు, యువతులపై పెరిగిపోతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా అశ్లీలను పంచే వెబ్‌సైట్లను తెలంగాణలో మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, దాదాపు 1,350 అశ్లీల వెబ్‌సైట్లను మూసివేసేందుకు రాత్రింబవళ్లు పని చేస్తున్నామని ఐటి విభాగంలోని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

పెద్దలు మాత్రమే వీక్షించే చిత్రాలు ఇకపై తెలంగాణలోని ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులో ఉండవన్నారు. అశ్లీల చిత్రాల వెబ్‌సైట్లకు చెక్ పెట్టేందుకు చైనా ఉపయోగిస్తున్న సాంకేతి పరిజ్ఞానాన్ని వాడే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అశ్లీల, అసభ్య(పోర్నోగ్రఫీ) చూడాలనే వారు తరచుగా కొన్ని రకాల పదాలను ఉపయోగించి సెర్చ్ ఇంజిన్లలో వెతుకుతుండటం తెలిసిందే.

ఇలాంటి వెబ్‌సైట్లకు చెక్ పెడితే పోర్నోగ్రఫీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇక లభించవు. అయితే దీనికి కేంద్ర సమాచారా, ప్రసారశాఖ, హోంమంత్రిత్వ శాఖ ఆమోదం లభించాల్సి వుంది. దీనికి కేంద్రం నుంచి తప్పకుండా ఆమోదం లభిస్తుందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. మహిళల భద్రతపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సూచన ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

లండన్ లాంటి నగరాల్లో అశ్లీల వెబ్‌సైట్ల నిషేధం విధించిన విషయాన్ని కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. వెబ్‌సైట్ల మూసివేత అనేది విధానపరమైన నిర్ణయమని, కేంద్ర నిర్ణయం కోసం తాము వేచిచూస్తున్నామని సైబరాబాద్ అదనపు ఉప కమిషనర్ జానకీషర్మిల తెలిపారు. కాగా, అశ్లీల వెబ్‌సైట్లను బంద్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+