ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ : తేల్చేసిన తెలంగాణ - ఏపీ ఏం చేయనుంది..!!

ప్రధాని మోదీ పెట్రో ఉత్పత్తుల పై వ్యాట్ తగ్గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కరోనా పైన వీడీయో కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేసిన ప్రధాని..అందులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఎక్సైజ్ పన్ను లు తగ్గించినా..కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించలేదని..సామ్యులకు లబ్ది చేకూరేలా పన్నులు తగ్గించాలని కోరుకుంటున్నానంటూ వ్యాఖ్యానించారు. ఇక, దీని పైన ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో స్పందన వ్యక్తం అయింది. ప్లీనరీ వేదికగానే ఈ అంశం పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రధాని ప్రతిపాదన పై కేసీఆర్ సీరియస్

ప్రజల పైన భారం వేయవద్దంటే మీరు ఎందుకు ధరలు పెంచుతున్నారంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటి వరకు ఒక్క సారి కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచలేదని స్పష్టం చేసారు. పెంచిన పాపం కేంద్రానిదే అంటూ ఫైర్ అయ్యారు. లేని సెస్సులు ఎందుకు పెంచుతున్నారంటూ నిలదీసారు. ఇదే అంశం పైన మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు.

తెలంగాణ పేరు ప్రస్తావించటం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన కేటీఆర్ ట్వీట్ చేసారు. కేంద్ర విధానాల కారణంగానే పెట్రోల్..డీజిల్ ధరలు పెరిగాయని ఫైర్ అయ్యారు. 2014 నుంచి ఇప్పటి వరకు తాము వ్యాట్‌ను పెంచలేదని గుర్తుచేసిన కేటీఆర్.. మీ ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌లో మా చట్టబద్ధమైన హక్కు 41 శాతం వాటా రావడం లేదని ధ్వజమెత్తారు.

కేంద్రమే నిర్ణయిస్తే రూ 70 కే పెట్రోల్

ఏడాదిలో మాకు కేవలం 29.6 శాతం మాత్రమే వస్తోంది.. దయచేసి సెస్‌ను రద్దు చేయండి.. అప్పుడు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ రూ. 70కి, డీజిల్‌ రూ. 60కు వస్తుందని సూచిస్తూ.. వన్‌ నేషన్‌ - వన్‌ రేటు..అంటూ ట్వీట్ చేసారు. ప్రధాని పెట్రో పన్నుల గురించి స్పందిస్తూ..ఏపీ - తెలంగాణతో పాటుగా మరిన్ని రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. పన్ను తగ్గించక పోతే ప్రజలను మోసం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.

దీని పైన ప్రతిపక్ష పార్టీలు సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. తెలంగాణ సీఎం - మంత్రి కేటీఆర్ సైతం ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రధాని సూచనలను పాటిస్తుందా..లేక, ఇదే తరహాలో సమాధానం ఇస్తుందా అనేది చూడాల్సి ఉంది. గతంలో కేంద్రం ఎక్సైజ్ పన్ను తగ్గించిన సమయంలోనే...ఏపీ ప్రభుత్వం సైతం వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీతో సహా ఇతరులు డిమాండ్ చేసారు.

ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..

ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..

కానీ, ప్రభుత్వం మాత్రం నాడు రాజకీయంగా వచ్చిన విమర్శలను కౌంటర్ చేసింది. ఇక, ఇప్పుడు నేరుగా ప్రధాని...వీడియో కాన్ఫిరెన్స్ లో సీఎంలతోనే డైరెక్ట్ గా పన్నుల అంశం ప్రస్తావించటం.. తగ్గించాలని సూచించటంతో..ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏపీ సైతం రియాక్ట్ అవుతుందా లేక దీని పైన పూర్తి వివరాలను వెల్లడించే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాల్సి ఉంది.

అయితే, ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాట్ తగ్గించే అవకాశాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రమే పెట్రో ఉత్పత్తుల పైన వసూలు చేస్తున్న సెస్ ను మినహాయించాలని ఏపీ అధికార పార్టీ వైసీపీ సైతం డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని సూచన అమలు దిశగా ఇతర రాజకీయ పార్టీలు సైతం వైసీపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+