విద్యార్థికి తెలంగాణ హాల్ టికెట్: అనుమతించలేదు
ప్రకాశం: ఆంధ్రదేశ్‌లో ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థికి తెలంగాణ స్టేట్ బోర్డు పేరుతో హాల్ టికెట్ అందింది. దీంతో హాల్ టికెట్ అందుకున్న విద్యార్థి ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన సూరిపోగు రాజ్‌కుమార్ ఇంటర్ ఒకేషనల్‌లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో బుధవారం పరీక్ష రాసేందుకు వచ్చాడు. హాల్ టికెట్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ పేరుతో రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు అతన్ని అనుమతించలేదు. తాను చేయని తప్పుకు పరీక్ష రాసే అవకాశం కోల్పోవడంతో ఆ విద్యార్ధి తీవ్ర ఆవేదనకు గురై ఇంటిముఖం పట్టాడు.
ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎంబిఏ, ఎంసిఏ ప్రవేశాలకు సంబంధించి ఐసెట్-2015 నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఐసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ రాజు, కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రమూర్తి బుధవారం నోటిఫికేషన్ విడుల చేశారు. మే 16న పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 30 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications