విజయమ్మపై గుడ్లు, బుల్లెట్ ప్రూఫ్ కారు: జగన్‌కూ సెగ

కొణిజెర్లలో పలువురు తెలంగాణవాదులు విజయమ్మ కాన్వాయ్ పైన కోడిగుడ్లు విసిరారు. విజయమ్మ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ద్రోహి వైయస్సార్ కాంగ్రెసును తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటూ హెచ్చరించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. విజయమ్మ పర్యటన నేపథ్యంలో నల్గొండ - ఖమ్మం జిల్లా సరిహద్దులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయమ్మకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు.
జగన్‌కూ సెగ
మరోవైపు తన ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. తెలంగాణ ద్రోహి జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోటీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications