మార్గదర్శి కేసు - రామోజీపై చర్యలు : హైకోర్టు కీలక ఆదేశాలు..!!
మార్గదర్శి సంస్థ..యాజమాన్యంపై చర్యల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
మార్గదర్శి సంస్థ..యాజమాన్యంపై చర్యల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజ, మార్గదర్శి చిట్‌ఫండ్స్ కంపెనీపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు తేలేదాకా.. ఏ ఫిర్యాదుల్లోనూ చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. మార్గదర్శి పిటిషన్లను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఏపీలో కొద్ది రోజులుగా మార్గదర్శి సంస్థల్లో సీఐడీ సోదాలు చేసింది. అక్రమాలు జరుగుతున్నట్లుగా గుర్తించినల్లు వెల్లడించింది. సంస్థకు చెందిన పలు శాఖలకు చెందిన బ్రాంచి మేనేజర్లను అదుపులోకి తీసుకొని విచారించింది. కీలక సమాచారం సేకరించింది. ఇదే సమయంలో ప్రభుత్వం, సీఐడీ నమోదు చేసిన క్రిమినల్ కేసులను కొట్టేయాలని.. వాటిని స్వతంత్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని రామోజీరావు, శైలజ, మార్గదర్శి చిట్‌ఫండ్స్ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శి కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉందని తెలిపారు.

చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి మార్గదర్శి ఖాతాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్దంగా మళ్లింపు చేసినట్టు ఆరోపణలు ఉన్నందున సీఐడీ అధికారులు పలు బ్రాంచులలో రైడ్స్ చేసి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న మార్గదర్శి కేసులు తేలే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నమోదైన ఫిర్యాదులతో పాటు ఇలాంటి ఇతర ఫిర్యాదుల్లోనూా ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శిలో చిట్‌లు వేసిన ఏ వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని.. ప్రభుత్వం కావాలనే జోక్యం చేసుకుంటోందని పిటీషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications