కృష్ణా నీటిపై ఇదేం పద్ధతి: ఎపిపై ధ్వజమెత్తిన హరీష్ రావు

హైదరాబాద్: నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నీటి కోసం ఆంధ్రప్రదేశ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. రాతపూర్వకంగా, న్యాయసూత్రాల ప్రకారం రావాలని అడిగితే డ్రామాలు ఆడుతున్నారని, హెచ్చరికలు చేస్తున్నారని, ఇదేం పద్ధతి అని ఆయన అన్నారు. కృష్ణా నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఓ సూత్రాలకు కూడా లోబడి లేదని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇప్పటికే ఎపి 43.31 టిఎంసి నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుందని ఆయన చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పునకు, బచావత్ అవార్డు నిబంధనలను అనుసరించి తాము న్యాయబద్ధంగా నీటిని వాడుకోవాలని చెబుతుంటే ఎపి వినడం లేదని ఆయన అన్నారు. నీటి వాడకం విషయంలో దేశంలో ఉన్న విధానాలను పాటిద్దామని చెబుతుంటే వినడం లేదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును, న్యాయసూత్రాలను పాటిద్దామని చెబుతున్నామని ఆయన అన్నారు. వాటి ప్రకారం తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో 229.9 టిఎంసిల నీరు రావాలని, ఇప్పటి వరకు తెలంగాణ వాడుకుంది కేవలం 140.4 టిఎంసిలు మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణకు ఇంకా 89.511 టిఎంసిల నీరు రావాల్సి ఉందని ఆయన అన్నారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటు 322.611 టిఎంసీలని, ఇప్పటికే ఎపి 365.75 టిఎంసిల నీరు వాడుకుందని, ఆ రకంగా ఎపి అదనంగా 43.13 టిఎంసిల నీటిని వాడుకుందని ఆయన వివరించారు.

Telangana irrigation minister Harish Rao blames AP government on Krishna river water

కృష్ణా జలాల వాడకంలో ఆంధ్రప్రదేశ్ ఏ సూత్రాన్ని కూడా పాటించడం లేదని ఆయన విమర్సించారు. అలా ఒప్పుకోకుండా ఇస్తారా, చస్తారా అనే పద్ధతిలో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా 2 లక్షలకు పైగా ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉందని, ఖమ్మం జిల్లాలోని పంటలకు మార్చి నెలాఖరు వరకు నీరు అందించాల్సి ఉంటుదని ఆయన చెప్పారు. తెలంగాణలో పంటలు ఎండిపోయినా ఫరవాలేదు, తాము నీళ్లు తీసుకుని వెళ్తామనే పద్ధతిలో ఎపి వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కరెంట్ లేక తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే ఎపి పట్టించుకోలేదని, కానీ తాము మానవతా దృక్పథంతో ముందుకు వస్తున్నా మొండి వైఖరి అవలంబిస్తోందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు కూడా నష్టపోకూడదని తాము ముందుకు వస్తుంటే ఎపి వినడం లేదని ఆయన అన్నారు.

ప్రతిపాదనను రాతపూర్వకంగా ఇవ్వాలని, ఆ ప్రతిపాదలనపై చర్చించి సర్దుబాటు చేసుకుందామని అడిగితే ఎపి వినడం లేదని ఆయన అన్నారు. లెక్క ప్రకారం కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఎపికి హక్కు లేదని, అయినా తాము ముందుకు వచ్చామని ఆయన చెప్పారు. వాస్తవిక దృష్టితో న్యాయబద్దంగా వ్యవహరించాలని చెబుతుంటే వినడం లేదని ఆయన అన్నారు. అయితే ఎపి ప్రభుత్వం లెక్కలు చూసుకునేది లేదు, రాతపూర్వకంగా ఇవ్వం, మొత్తం తీసుకుంటామనే మొండి ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. మొండిపట్టుదలకు పోతే నష్టపోతారని ఆయన అన్నారు.

ఎపి అవసరాలకు మించి వాడుకోలేదు
ప్రకాశం, గుంటూరు జిల్లాలుకు వాడుకుంది 5 టిఎంసిలే
కృ,శ్ణా బోర్డుకు లేఖ
జోక్యం చేసుకోవాలని వితిదేవినేని ఉమ ఫైర్

సాగర్‌ నీటిని ఏపీ ప్రభుత్వం ఎక్కువగా వాడుకుందని టీ.మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణను ఆంధ్ర ప్రదేశ్ నీటి పారదుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఏపీ రైతాంగాన్ని వేధిస్తోందని ఆయన అన్నారు. రాష్ర్టాలు వేరైనా రైతు ప్రయోజనాలే ముఖ్యమని భావించినందు వల్లనే తెలంగాణ రాష్ట్ర రైతులు పులిచింతల నీటిని అధికంగా వాడుకున్నా తమ ప్రభుత్వం మాట్లాడలేదని మంత్రి అన్నారు. ఎపి అవసరాలకు మించి నీటిని వాడుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+