టిపై పురంధేశ్వరి, మా చేతుల్లో ఉండదని ఉండవల్లి

Purandeswari and Arun Kumar
హైదరాబాద్: తమ ఒత్తిడి మేరకే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జాప్యమని కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి సోమవారం అన్నారు. తెలంగాణ నోట్ కేబినెట్‌కు వచ్చే అంశంపై స్పందిస్తూ... కేబినెట్ మీటింగ్ ఎప్పుడు అనే సమాచారం లేదని ఆమె చెప్పారు. విభజన ప్రక్రియలో జాప్యం మాత్రం సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకుల వల్లనే అన్నారు.

2014 వరకు అడ్డుకుంటాం: ఉండవల్లి

రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. 2014 వరకు తాము రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకుంటామని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకు రాకుంటే మాత్రం విభజనను అడ్డుకోవడం తమ చేతులలో ఉండదని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. తాను రాజీనామా అంశంపై కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని చెప్పారు.

కెసిఆర్ మాటలు తెలంగాణ సంస్కృతికి విరుద్ధం: పొంగులేటి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు తెలంగాణ సంస్కృతికి విరుద్ధమని కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా అన్నారు. సకల జన భేరీలో కెసిఆర్ భాష అభ్యంతరకరమన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని అభినందించక పోవడమేమిటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ పెద్దగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను తమ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+