కిరణ్ రెడ్డి రాజీనామాపై సస్పెన్స్: పైచేయికి బొత్స

హైదరాబాద్: రాష్ట్ర విభజనలో తాను పాలుపంచుకోలేనని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదుపరి చర్య ఏమిటనేది బుధవారం సాయంత్రానికి కూడా సస్పెన్స్‌గానే ఉంది. రేపు చివరి రోజు అంటూ నర్మగర్భంగా మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభా సమావేశాలకు అని ముక్తాయింపు ఇచ్చారు. అయితే, ఆయన రేపు గురువారం రాజీనామా చేస్తారనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల నేపత్యంలో బుధవారం సాయంత్రం కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్రకు చెందిన మంత్రులు శైలజానాథ్, కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరావు తదితరులు సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని పితాని సత్యనారాయణ వంటి మంత్రులు చెబుతున్నా ఎప్పుడు రాజీనామా చేస్తారనేది కచ్చితంగా తేలడం లేదు. 13వ తేదీన ఆయన రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. అయితే, అది రేపు లోకసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే మాత్రమే జరుగుతుందని అంటున్నారు.

Telangana issue: Reddy keeps up suspense over next move

కాగా, కిరణ్ కుమార్ రెడ్డిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి లేదా ఇతరులు ఎవరైనా గానీ ఈ సమయంలో రాజీనామా చేయడం వల్ల లాభమేమీ లేదని, ఎన్నికలు కొద్ది నెలలు మాత్రమే ఉన్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయరనే ఆశాభావంతో ఉన్నట్లు ఆయన తెలిపారు.

నిరుడు జులై 30వ తేదీన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న వెంటనే సామూహికంగా రాజీనామాలు చేస్తే ఫలితం ఉండేదని, తాను రాజీనామాలు చేద్దామని సూచించానని ఆయన అన్నారు. ఆరు నెలల క్రితం సీమాంధ్ర నేతలమంతా రాజీనామాలు చేయకపోవడం చారిత్రక తప్పిదమని కూడా ఆయన అన్నారు. అప్పుడు రాజీనామాలు చేసి ఉంటే రాష్ట్ర విభజనకు కేంద్రం పూనుకోవడం కష్టంగా మారి ఉండేదని ఆయన అన్నారు.

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు రాజీనామా చేయవచ్చుననే ఊహాగానాలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే, గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఈ నెల 15వ తేదీన తిరిగి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అప్పటి వరకు వేచి చూసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. కాగా, తెలంగాణ బిల్లు ఈ నెల 18వ తేదీ తర్వాతనే పార్లమెంటుకు వస్తుందనే కొత్త ప్రచారం సాగుతోంది. అందువల్ల రేపు బిల్లు లోకసభకు రాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం కూడా లేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+