టీ జెఎసి పార్టీ కాదు, కాలేదు: కోదండరామ్ స్పష్టం

రాజకీయాలను తక్కువ చేసి చూసే ఉద్దేశం తమకు లేదని, ప్రజా సంఘం రాజకీయ పార్టీలకూ ప్రజలకూ మధ్య వారధిలా పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఉద్యమ నేతలు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందని, ఉద్యమ నాయకులకు రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము పోషించాల్సిన పాత్రపై చర్చించలేదని ఆయన అన్నారు.
పోలవరం ముంపు గ్రామాల సమస్య తెలంగాణకు మాత్రమే సంబంధించింది కాదని, అది ఆదివాసీలందరి సమస్య అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా తాము పోరాటం చేస్తామని చెప్పారు. అపాయింటెడ్ డేను వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ జెఎసి కొనసాగుతుందని ఆయన చెప్పారు. తాము రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకమే అయినప్పటికీ అనివార్యమైన స్థితిలో సమర్థిస్తున్నామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతల కారణంగానే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని కోదండరామ్ చెప్పారు. మరో రెండు రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని, ఈ నెల 11వ తేదీ నుంచి విజయోత్సవ సభలు నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications