తిరుమలలో తెలంగాణ: కిరణ్ రెడ్డి కొత్త పార్టీ ఆశలు

హైదరాబాద్‌: కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణ నేతలు తమ తెలంగాణ రాష్ట్ర వాదాన్ని వినిపించగా, సీమాంధ్రకు చెందిన సమైక్యవాదులు రాష్ట్ర సమైక్యంగా ఉంటుందనే ఆశను వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం తిరుమల భక్తులతో పోటెత్తింది. వారికి తోడు విఐపి భక్తులకు కూడా కొదవ లేకుండా పోయింది. తెలంగాణ, సీమాంధ్ర నాయకులు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడం ఖాయమని, కిరణ్ రెడ్డి పార్టీ పెట్టాలనేది తన అభిప్రాయమని రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి అన్నారు. కిరణ్ రెడ్డి కొత్త పార్టీ గుర్తు బ్యాట్ అని కూడా ఆయన చెప్పారు. కొత్త పార్టీ జెండా, గుర్తులు త్వరలో రూపు దిద్దుకుంటాయని ఆయన అన్నారు. కిరణ్ రెడ్డి పార్టీ పెట్టాలని రాష్ట్ర సమైక్యతను కోరుకునేవారు ఒత్తిడి తెస్తారని ఆయన అన్నారు.

రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సీమాంధ్రకు చెందిన మంత్రి కొండ్రు మురళి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కొండ్రు మురళి తెలిపారు. వర్షాలు సమయానికి రావాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర విభజన ఖాయమని తెలంగాణకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడుతారనే అనుమానాలున్నాయని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. పార్టీ పెడతారనే ప్రచారాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఖండించడం లేదని, దీంతో అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడం సాధ్యం కాదని ఆయన అన్నారు. బిల్లుపై శాసనసభలో చర్చ పూర్తియన వారం రోజుల్లోనే పార్లమెంటుకు వెళ్తుందని ఆయన చెప్పారు.

తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారని, విలీనం చేస్తారని ఆశిస్తున్నామని మంత్రి డికె అరుణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఇరు ప్రాంతాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సజావుగా సాగుతోందని మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+