రాజ్యసభ: కెవిపికి జయసుధ, తెలంగాణ నేతల ఆగ్రహం
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు రాజ్యసభ అభ్యర్థి ఎంఏ ఖాన్‌కు పోగా మిగిలిన ఓట్లను సీమాంధ్ర ప్రాంత పార్టీ అభ్యర్థి కెవిపి రామచంద్ర రావుకు కేటాయించడంపై టి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన ఓట్లను తాము తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కె కేశవ రావుకు వేస్తామని వారు చెబుతున్నారు. గోల్కొండ హోటల్లో భేటీ అయిన టి నేతలు ఓటింగు విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు.
రాజ్యసభ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును కాంగ్రెసు అభ్యర్థి ఎంఏ ఖాన్‌కు, రెండో ప్రాధాన్యత ఓటును కెకెకు వేయాలని నిర్ణయించారు. మిగిలిన ఓట్లలో తొలి ప్రాధాన్యత ఓటును కెకెకు వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదుకు చెందిన పలువురు ఎమ్మెల్యేల ఓట్లను అధిష్టానం కెవిపి, టి సుబ్బిరామి రెడ్డిలకు కేటాయించింది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కెవిపి రామచంద్ర రావుకు మంత్రి దానం నాగేందర్, సికింద్రాబాద్ శాసన సభ్యురాలు జయసుధ, టి సుబ్బిరామి రెడ్డికి ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డిల ఓట్లను అధిష్టానం కేటాయించింది. వారికి ఓటేసేందుకు తెలంగాణ ప్రాంత నేతలు తిరస్కరించారు.
కాగా, మధ్యాహ్నం పదకొండు గంటల వరకు 190 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 276 మంది శాసన సభ్యులు ఓటు వేయనున్నారు. కాంగ్రెసు పార్టీ ఒక్కో అభ్యర్థికి 47, టిడిపి 37 మంది సభ్యులను కేటాయించింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications