వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఎంసెట్: టాప్ 10లో తెలంగాణ హవా, ప్రాక్టీస్‌లా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్‌లో తెలంగాణ విద్యార్థులు చాలామంది నిలిచారు. ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లో తెలంగాణ విద్యార్థులు ముందంజలో నిలిచారు. ఎంసెట్‌లో టాప్ టెన్‌లో ఎక్కువ ర్యాంకులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాసిన వారికి వచ్చాయి.

అందులో, ఏపీ విద్యార్థులతో పాటు వరంగల్, నల్గొండ జిల్లా విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే, ఏపీలో 15 శాతం కోటా ఉంటే, దాని కిందనే తెలంగాణ విద్యార్థులు సీట్లు పొందుతారు.

ఇంజినీరింగ్ విభాగంలో.. అనిరుధ్ రెడ్డి (హైదరాబాద్), అక్షిత్ రెడ్డి (వరంగల్), కోసూరి జోషి (విజయనగరం), అహ్వాన రెడ్డి (రంగారెడ్డి), సందీప్ కుమార్ (విజయనగరం)లు ఉన్నారు.

 Telangana students rule top 10 Andhra Pradesh Eamcet ranks

మెడిసిన్ విభాగంలో... శ్రీ విధుల్ (హైదరాబాద్), సాయి భరద్వాజ (రంగారెడ్డి), రామిని శ్రీరమ (రంగారెడ్డి), జయహరీష్ (గుంటూరు), సాయిధీరజ్ రెడ్డి (గుంటూరు)లు ఉన్నారు.

మరోవైపు, ఏపీలో తెలంగాణ కంటే ఐదు రోజుల ముందు ఎంసెట్ నిర్వహించారు. ఇది తెలంగాణ విద్యార్థులకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడింది. ఏపీలో జరిగిన ఎంసెట్ పరీక్ష.. తెలంగాణ కంటే ముందు జరగడంతో.. తెలంగాణ విద్యార్థులకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడిందని అంటున్నారు.

English summary
Telangana students dominated the first Andhra Pradesh Eamcet bagging most of the top ten ranks in engineering and medical streams. Most of the rankers in the Andhra Pradesh Eamcet were from Hyderabad and Ranga Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X