పన్ను వసూలు తప్పదు: ఏపీ వెహికిల్స్‌పై మంత్రి మహేందర్‌రెడ్డి
హైదరాబాద్: పన్ను వసూలు తప్పనిసరి అని, ప్రయివేటు ట్రావెల్స్ వారు అందుకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి మంగళవారం అన్నారు. పన్ను వసూలు చేయకుంటే తెలంగాణ రాష్ట్రానికి నష్టమన్నారు. ఇప్పటి వరకు అన్ని స్థాయిల్లో చర్చలు జరిగాయని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పన్ను వసూలుపై జీవో విడుదల చేశామన్నారు. కోర్టు నిబంధనలకు లోబడే పన్నులు వసూలు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో రగడ రాజుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చే వాహనాల పైన తెరాస ప్రభుత్వం పన్ను విధించాలని నిర్ణయించింది. మంగళవారం అర్ధరాత్రి నుండి ఇది అమలులోకి రానుంది.

అర్ధరాత్రి నుండి అంతర్రాష్ట్ర పన్నుల విధానం ఏపీకి కూడా వర్తింప చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తీరు పైన ఏపీ ప్రయివేటు బస్సుల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఏపీ ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యం బుధవారం హైకోర్టుకు వెళ్లనుంది. ఏపీ మంత్రి శిద్దా రాఘవ రావు కూడా దీనిపై స్పందించారు.
తెలంగాణకు ఏపీ నుండి వచ్చే వాహనలు...
ఏపీ నుండి తెలంగాణకు వచ్చే వాహనాలు దాదాపు 3,85,836 వరకు ఉంటాయి. అందులో స్టేజ్ క్యారియర్లు 19వేలకు పైగా, మాక్యీ క్యాబ్‌లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. లారీలు 3700 వరకు ఉంటాయి.
బస్సుకు ఇప్పటి వరకు లక్షా అయిదు వేల ట్యాక్స్ పడుతోంది. కొత్త పన్నుతో రెండు లక్షల తొంభై ఆరువేల వరకు అవుతుందని అంటున్నారు. ఆరు టైర్ల లారీకి ఇప్పటి వరకు రూ.3500 కాగా, ఇక నుండి రూ.పదివేల వరకు అవుతుందంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications