Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్‌పై పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం, ముందే టి ఇస్తే...

హైదరాబాద్/మహబూబ్ నగర్: టిడిపి - బిజెపి కూటమికి ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన నిప్పులు చెరిగారు. కెసిఆర్‌కు తెలిసిందల్లా తిట్ల పురాణమేనని మండిపడ్డారు. అమరుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చిందని, ఇద్దరు ఎంపీలతో తెరాస తెలంగాణ ఎలా తెస్తుందని ప్రశ్నించారు.

త్యాగ ఫలాలు అడ్డం పెట్టుకొని సిఎం కావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెరాసది ఆచరణ సాధ్యం కాని ముసాయిదా అని, ఢిల్లీలో దేవత అయిన సోనియా... హైదరాబాదుకు వచ్చేసరికి దెయ్యం అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే ఉద్యమకారులను పక్కన పెట్టి, తాను, తన కుటుంబసభ్యులే తెలంగాణాను సాధించామన్నట్టు సోనియాని కలిసి కృతజ్ఞతలు తెలిపి వచ్చిన కెసిఆర్ ఆ తర్వాత మాట మార్చి, తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియానే దూషిస్తూ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారన్నారు.

Telangana was possible due to martydom: Pawan

తెలంగాణ కోసం బలిదానాలు చేసిన యువత కుటుంబాలకు అండగా నిలుస్తానన్నారు. విభజనపై యూపిఏ ముందే ప్రకటన చేస్తే 1200 మంది అమాయకుల ప్రాణాలు నిలిచేవని, కేవలం కొడుకు కోసం సోనియా విభజన అనే వికృత క్రీడ తెరలేపారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎన్డీయేనైనా నిలదీస్తానన్నారు. యూపిఏ, ఎన్డీయేలు రాష్ట్రానికి ఇంటి పెద్దలు లాంటివని, అలాంటి ఇంటి పెద్దలను కెసిఆర్ దూషిస్తూపోతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని పవన్ ప్రశ్నించారు.

ఢిల్లీలో సోనియాను దేవత అని పొగిడి, హైదరాబాద్‌కు రాగానే అదే దేవతను దెయ్యంగాను.. బలిదేవతగానూ మార్చేసిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో నైజం ఉంటుందని, కెసిఆర్‌కు తిట్టే నైజం ఉందన్నారు. దేశానికి మోడీ నాయకత్వం అవసరమన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటే.. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ మారో జవాన్, మారో కిసాన్ అంటోందన్నారు. చెల్లెళ్ల రక్షణ కోసం జనసేన హామీ ఇస్తుందన్నారు.

అసలైన మతతత్వ పార్టీ కాంగ్రెస్సే అన్నారు. సిక్కులను ఊచకోత కోసిందని ఆరోపించారు. బిజెపి మతతత్వ పార్టీ కాదన్నారు. అన్ని మతాల వారికి బిజెపిలో సమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎకరా భూమిలో రూ.కోటి ఎలా సంపాదించవచ్చు కెసిఆర్ చెప్పాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కమలం, సైకిల్ గుర్తులకు ఓటు వేసి ఆ పార్టీల అభ్యర్థులను గెలిపించాలన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోను, ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలోను, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్, కల్వకుర్తిల్లో ప్రచారం చేశారు.ట

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+