వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్తి అగర్వాల్ మృతి, గతంలోను: లైపోకు మొగ్గు, భారీగా క్లినిక్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పదహారేళ్ల వయస్సులోనే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆర్తి అగర్వాల్ లైపో సర్జరీ ఫెయిల్ కావడంతో మృతి చెందారు. గతంలోను లైపో కారణంగా మృతి చెందిన వారు ఉన్నారు.

అత్యంత ఆధునాతనమైన సౌకర్యాలుండే అమెరికాలాంటి దేశంలో లైపోలాంటి చికిత్స చేయించుకుంటూ అది వికటించి మృతి చెందడం గమనార్హం. అధిక కొవ్వుతో లేదా బరువుతో బాధపడేవారికి మంచి ఆకృతిని ఇచ్చేదే లైపోసక్షన్ సర్జరీ.

పొట్ట, తుంటి, రొమ్ములు, ముఖం, తొడలు తదితర భాగాల్లో కొవ్వు పోగుబడి చర్మాన్ని సాగదీస్తుంది. దీంతో శరీరాకృతి మారుతుంది. అధికంగా పేరుకుపోయిన కొవ్వును తొలగించి సాధారణ స్థితికి తెచ్చే ప్రక్రియే లైపోసక్షన్.

మన వద్ద లైపో ఫెయిలై మృతి చెందిన వారు ఉన్నారు. గత ఏడాది అమీర్ పేటలోని ఓ క్లినిక్‌లో లైపో సర్జరీ కారణంగా ఇతర సమస్యలు తలెత్తి బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి ఒకరు మృతి చెందారు. స్థూలకాయం తగ్గించుకునేందుకు వెళ్లి సర్జరీ సమయంలో అతని పెద్దపేగుకు రంద్రం ఏర్పడింది. దీంతో మలం బయటకు వచ్చి శరీరంలో వ్యాపించి, ఇన్ఫెక్షన్ అయి అవయవాలు దెబ్బతిని మృతి చెందాడు.

Telugu actor Aarthi Agarwal dies after 'failed liposuction' surgery

ఇలాగే ఉప్పల్‌కు చెందిన ఓ అధికారి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. లైపో ఫెయిలై విదేశాల్లో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. నటులు, మోడల్స్ కూడా అందులో ఉన్నారు.

కాస్మెటిక్ సర్జరీ అంటే క్విక్ ఫిక్స్ సొల్యూషన్ అని చాలామంది భావిస్తుంటారని, దానివల్ల కొండొకచో ప్రమాదాలు కూడా ఉంటాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక బరువు ఉండేవారితో పేలిస్తే స్థూలకాయంతో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంట.

లైపో సర్జరీ చేస్తే.. స్థూలకాయంతో బాధపడేవారి నుండి పెద్దమొత్తాల్లో కొవ్వును తీసినప్పుడు శరీర స్రావాలు కూడా ఆ మేరకు తగ్గిపోయి రక్తపోటు పడిపోయే ప్రమాదముందని, అందుకే వైద్యులు లైపోకు అంగీకరించరని, శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయిన వారికి ఆకృతినిచ్చేందుకు మాత్రమే లైపో చేయడానికి వారు సిఫార్సు చేస్తారని అంటున్నారు.

సర్జరీ విజయవంతమైనా ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇందుకోసం వైద్యుల సలహాలు పాటించాలని చెబుతున్నారు. లైపో సర్జరీ ద్వారా చాలా తక్కువ సందర్భాల్లోనే ఇలాంటి విషాధ సంఘటనలు జరుగుతున్నప్పటికీ.. వ్యాయామం, డైట్ ద్వారా కొవ్వును కరిగించుకుంటే మరింత మంచిదని చెబుతున్నారు.

మారుతున్న జీవన శైలితో నగరంలో ఊబకాయం సమస్యగా మారింది. దీంతో ఇటీవల సర్జరీలు బాగా పెరిగాయి. నగరంలో పెద్ద ఎత్తున క్లినిక్‌లు పుట్టుకు వస్తున్నాయి.

English summary
Telugu actor Aarthi Agarwal dies after 'failed liposuction' surgery
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X