కర్నూల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వాణిశ్రీ గెలుపు
డోన్ సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. గురువారం ఎన్నిక జరిగింది.
కర్నూలు: డోన్ సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. గురువారం ఎన్నిక జరిగింది. జిల్లాలోని కొండపేటలోని సహకార సంఘం కార్యాలయంలో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తిమ్మారెడ్డిపై 9 ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్థి శ్రీవాణి గెలిచారు.

కాగా సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న గోపాల్ రెడ్డికి జీవిత ఖైదు పడటంతో చైర్మన్ పదవి కోల్పోవాల్సి వచ్చింది.
ఆయన స్థానంలో సింగిల్ విండో చైర్మన్‌గా వాణిశ్రీని తాత్కాలిక చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అయితే ఖాళీ ఏర్పడిన చైర్మన్ పదవికి ఎన్నిక జరపాలని నోటిఫికేషన్ విడుదల చేయగా ఇవాళ ఉప ఎన్నిక జరిగింది.












Click it and Unblock the Notifications