డాలర్లకు చిక్కి: అమెరికా వర్సిటీలు మనోళ్లకు ఎలా వల వేస్తున్నాయి?

హైదరాబాద్: అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లిన మన విద్యార్థులను కొందర్నివెనక్కి తిప్పి పంపుతున్నారు. కొన్ని అమెరికా విశ్వవిద్యాలయాలు... మన విద్యార్థులతోనే కొత్త వారికి ఎర వేస్తున్నాయంటున్నారు. డాలర్లు ఇస్తామని మన వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నాయని చెబుతున్నారు.

విదేశీ విశ్వవిద్యాలయాలు ఇచ్చే కమీషన్ల కోసం కొన్ని సంస్థలు నాసిరకం విద్యా సంస్థలను సిఫార్సు చేయడం, మరికొన్ని అమెరికా వర్సిటీలు కొత్త విద్యార్థులను ఆకర్షించడం కోసం తమ వద్ద ఇప్పటికే చదువుతున్న విద్యార్థులను వాడుకోవడం తాజా పరిస్థితికి కారణమని చెబుతున్నారు.

కొత్త విద్యార్థులను చేర్పిస్తే డాలర్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నాయట. వారి దారిలోకి వెళ్లిన విద్యార్థులు మరికొందరు విద్యార్థుల భవిష్యత్తును చిక్కుల్లో పెడుతున్నారని అంటున్నారు. గతంలో మూడు నాలుగు ప్రశ్నలు అడిగి పంపించారు.

Telugu group asks students to come to US well prepared

కానీ, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే... తెలుగు విద్యార్థులు అమెరికాలోని విమానాశ్రయాల్లో అడుగు పెట్టగానే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అనుమానించే దుస్థితి ఉందని చెబుతున్నారు.

విద్యార్థులు శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో దిగుతూ సిలికాన్‌ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్‌ వెస్ట్రన్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చేరేందుకు వచ్చామని చెబుతుండటంతో అధికారులు అనుమానించి క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. విద్యార్థులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఇప్పటికే కొందరిని వెనక్కి పంపించారు.

కన్సల్టెన్సీలతో పాటు ఇప్పటికే చేరిన విద్యార్థుల ద్వారా పుష్కలంగా విద్యా వ్యాపారం ఉంటుందని భావించిన కొన్ని వర్సిటీలు తెలుగు విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. ఒక విద్యార్థిని ఇక్కడ చేర్పిస్తే వందలాది డాలర్లు ముట్టచెప్పేందుకు ముందుకు వస్తున్నాయంట.

అమెరికా తెలుగు సంస్థల సూచనలు

చికాగో నుంచి 20 మంది తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించిన వార్తల నేపథ్యంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వంటి తెలుగు సంఘాలు విద్యార్థులకు పలు సూచనలు చేస్తున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+