పవన్ కల్యాణ్ ఫ్యాన్ హత్య: అక్షయ్ కుమార్ అరెస్టు

కోలారు/బెంగళూరు: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ (24) హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ ను కర్ణాటకలోని నరసాపుర పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 21వ తేదిన కర్ణాటకలోని కోలారులో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవ జరిగింది.

అదే రోజు రాత్రి నరసాపుర సమీపంలోని ఓ హోటల్ దగ్గర మళ్లీ వినోద్ రాయల్, అక్షయ్ కుమార్ ల మధ్య ఇదే విషయంలో ఘర్షణ జరిగింది. సహనం కొల్పోయిన అక్షయ్ కుమార్ జోబులో ఉన్న కత్తి తీసుకుని వినోద్ రాయల్ ను పొడిచాడు.

Telugu Power Star Pawan Kalyan supporter killed in Karnataka

రక్తం ఎక్కువ పోవడంతో అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఫలితం లేకుండాపోయింది. తప్పించుకుతిరుగుతున్న అక్షయ్ కుమార్ ను గురువారం నరసాపుర సమీపంలోని నందిని డాబా (నందిని హోటల్) దగ్గర అరెస్టు చేశారు.

తిరుపతికి చెందిన వినోద్ రాయల్ హత్య కేసులో మొత్తం 7 మంది ఉన్నారని పోలీసులు ఆధారాలు సేకరించారు. అక్షయ్ కుమార్ తో సహ మొత్తం ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+