పవన్‌కల్యాణ్‌పై బెట్టింగ్ కాసిన స్టార్ ప్రొడ్యూసర్
ఇటీవలే విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీలు మొత్తం 175 నియోజకవర్గాలకు 164 నియోజకవర్గాలను కైవసం చేసుకున్నాయి. తెలుగుదేశం 135 స్థానాల్లో, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. జనసేన తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన పవన్ కల్యాణ్ 70వేల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అంతేకాదు.. జనసేన పార్టీ వందకు శాతం స్ట్రైక్ రేట్ సాధించి దేశ రాజకీయాల్లో అరుదైన రికార్డును నెలకొల్పింది.
రూ.10 కోట్లు గోవిందా
పవన్ కల్యాణ్ ఓడిపోతాడని సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ పందెం కాసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి రెండింటిలోను ఓటమిపాలవగా.. ఈసారి కూడా అలాగే జరుగుతుందని, పవన్ కచ్చితంగా ఓడిపోతాడంటూ పవన్ కు వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా పందెం కాశాడు. అయితే ఎన్నికల ఫలితాల్లో పవన్ విజయం సాధించడంతో రూ.10 కోట్లను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవలి కాలం వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ నిర్మాత కొంతకాలం క్రితమే హిట్ సినిమాలు పడటంతో కాస్తంత కోలుకున్నాడు.

ముక్కు పిండి వసూలు చేశారు
అలా కోలుకున్న వ్యక్తి డబ్బులను జాగ్రత్త చేసుకుంటే బాగుండేదని, అలా చేయకుండా బెట్టింగ్ కాయడంతో ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని తెలుగు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ దారుణంగా పరాజయం పాలవడంతో బెట్టింగ్ కాసినవారు అతని దగ్గర నుంచి రూ.10 కోట్లు ముక్కు పిండి వసూలు చేశారని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి తనకు మద్దతిచ్చిన అందరికీ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీలో పరిశ్రమకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాదని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications