స్కూటీపై వెళ్తుంటే ఆంధ్ర టెక్కీ దాడి చేసి చెన్నైలో దోపిడీ
విజయవాడ: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీరుపై దాడి జరిగింది. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా విజయవాడకు చెదిన తమిళనాడులోని కామచిపు జిల్లా తాళంబూరులోలోని ఓ ఐటి కంపెనీలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని తన గదికి వెళ్తుండగా దాడికి గురైంది.

డ్యూటీ నుంచి తిరిగి వెళ్తుండగా..
రాత్రి విధులు ముగించుకుని లేడీ టెక్కీ శేమంచ్చేరి ప్రాంతంలో మలుపు తిరుగుతుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఐరన్ రాడ్‌తో దాడి చేశారు.

వాటన్నింటినీ దోచుకెళ్లారు
బాధితురాలి వద్ద ఉన్న ఐఫోన్ బంగారం, నగలను దోచుకుని వెళ్లిపోయారు. ఆమె స్కూటీని మాత్రం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దుండగులు వెళ్లిపోయిన తర్వాత రోడ్డు మీదికి వచ్చిన బాధితురాలు స్పృహ తప్పి పడిపోయింది.

పోలీసులకు సమాచారం ఇలా...
దారిలో వెళ్తన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తర్వాత గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలోని స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.

బంధువులకు సమచారం ఇచ్చారు
పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులను సంప్రదించడానికి ప్రయత్నించారు. అయితే, వారు అందుబాటులో లేరు. దాంతో బాధితురాలి సోదరికి సమాచరాం అందించారు. బాధితురాలి తల్లిదండ్రులది విజయవాడ సమీపంలోని తెలప్రోలు గ్రామం. వారిది వ్యవసాయ కుటుంబం.












Click it and Unblock the Notifications