స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ మధ్య హోరాహోరీ పోరు
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్స్ లో స్టార్ మా మరోసారి ఆధిక్యంలో నిలిచింది. సీరియల్స్ విషయంలో ఆ ఛానెల్ కు తిరుగులేకుండా పోతోంది. సినిమాలు కూడా కొత్తవి ప్రదర్శిస్తూ మిగతా ఛానళ్లకంటే టీఆర్పీని తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన రేటింగ్స్ లిస్టు చూస్తే టాప్ 10 సీరియల్స్ లో ఆరు సీరియల్స్ మాలో వచ్చేవే. మిగతా నాలుగు జీ తెలుగులోనివి.
జులై 7 నుంచి 14తో ముగిసిన వారానికిగాను తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విడుదలయ్యాయి. జులై 25వ తేదీ ఈ లిస్ట్ అప్‌డేట్ అయింది. ఇందులో స్టార్ మాకు చెందిన బ్రహ్మముడి సీరియల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ సీరియలే ప్రథమ స్థానంలో నిలిచింది. కొన్ని నెలలుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ కి తిరుగులేకుండా పోతోంది.

తాజా టీఆర్పీ రేటింగ్స్ టాప్ 10 లిస్టులో స్టార్ మా కాకుండా జీ తెలుగు సీరియల్స్ నాలుగున్నాయి. అధికారిక బార్క్ వెబ్ సైట్ నుంచి సేకరించిన రేటింగ్స్. కొంతకాలం నుంచి తెలుగు సీరియల్స్ లో స్టార్ మా, జీ తెలుగుకు సంబంధించినవే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ రెండు ఛానెళ్ల మధ్య రేటింగ్స్ కు సంబంధించి హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ రెండు ఛానళ్ల తర్వాత జెమినీ టీవీ, ఈటీవీ కొనసాగుతున్నాయి.
సీరియల్ పేరు ఛానెల్ టీఆర్పీ (అర్బన్ + రూరల్)
1. బ్రహ్మముడి స్టార్ మా 14.11
2. నాగ పంచమి స్టార్ మా 11.21
3. కృష్ణా ముకుందా మురారి స్టార్ మా 10.61
4. త్రినయని జీ తెలుగు 8.77
5. ప్రేమ ఎంత మధురం జీ తెలుగు 8.43
6. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ స్టార్ మా 8.28
7. మల్లీ నిండు జాబిలి స్టార్ మా 7.89
8. పడమటి సంధ్యారాగం జీ తెలుగు 7.76
9. నువ్వు నేను ప్రేమ స్టార్ మా 7.64
10. అమ్మాయిగారు జీ తెలుగు 6.83












Click it and Unblock the Notifications