తెలుగు యువత నేత మోసం, రాజధానిలో జాబ్స్ పేరుతో లక్షలు వసూలు
మంగళగిరిలో తెలుగు యువత నేత హరిబాబు ఆగడాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షల్లో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు: మంగళగిరిలో తెలుగు యువత నేత హరిబాబు ఆగడాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షల్లో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
మంత్రి పుల్లారావు పేరుతో తెలుగు యువత నేత హరిబాబు దందాలు చేస్తున్నాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తెలుగు యువత నేత హరిబాబుపై పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితుల వరుస ఫిర్యాదులతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తెలుగు యువత నేత హరిబాబు మోసం చేయడం స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications