బాబు లేని రాజకీయాలు ఊహకు అందలేదు జగన్, అక్కడే చంద్రబాబు ఎత్తులకు పైఎత్తులు !
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో భాగం అయిన చిత్తూరు నగరం తమిళనాడు సరిహద్దులో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే తిరుపతి, తిరుమల ఉండేది, నియోజక వర్గాల పునర్విభజన తరువాత తిరుపతి జిల్లా కేంద్రంగా అయ్యింది. చిత్తూరు రాజకీయాలను ఒకప్పుడు సీకే బాబు శాసించారు. ఎమ్మెల్యేగా ఉంటూనే సీకే బాబు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పారు.
రాయలసీమలోని చిత్తూరు నగరంలో 2015లో అప్పటి మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌లను ఏకంగా మేయర్ ఛాంబర్‌లోనే పట్టపగలు దారుణంగా హత్య చేయడంతో అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తరువాత చిత్తూరు నివురుగప్పిన నిప్పులా వుంటుందని ప్రజలు అంటూ ఉంటారు. 1952లో ఏర్పడిన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ మూడు సార్లు, ఇండిపెండెంట్, వైసీపీ ఒక్కోసారి చొప్పున విజయం సాధించారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చిత్తూరు, గుడిపాల మండలాలకే ఈ నియోజకవర్గం పరిమితమైంది. ఇక్కడి నుంచి సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు, ఇండిపెండెంట్‌గా ఒకసారి విజయం సాధించారు. చిత్తూరు అంటే సీకే బాబు అని, సీకే బాబు అంటే చిత్తూరు అన్నంతగా ఆయన బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీకే బాబు చాలా సన్నిహితుడు.
చిత్తూరు నగరంతో పాటు రాయలసీమలోని చాలా నియోజక వర్గాల్లో, కర్ణాటక రాజధాని బెంగళూరులో సీకే బాబు అనుచరగణం వుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాయలసీమ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గానూ సీకే బాబు పనిచేశారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 14 చోట్ల టీడీపీ గెలిచినా ఒక్క చిత్తూరులో మాత్రం సీకే బాబు విజయం సాధించడంతో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది
కొంతకాలం పాటు సీకే బాబు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగానూ వున్నారు. తరువాత అనారోగ్య కారణాలతో, వ్యక్తిగత కారణాలతో సీకే బాబు సైలెంట్ అయిపోయారని చిత్తూరు ప్రజలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులు చిత్తూరు నగరంలో కనిపిస్తాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,00,789 మంది. వీరిలో పురుషులు 97,610 మంది.. మహిళలు 1,02,046 మంది ఉన్నారని అధికారులు అంటున్నారు.

2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆరణి శ్రీనివాసులు అలియాస్ జంగాలపల్లె శ్రీనివాసులుకు 91,206 ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఏఎస్ మనోహర్‌కు 51,238 ఓట్లు పడ్డాయి. మొత్తంగా వైసీపీ 39,968 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా చిత్తూరులో పాగా వేసింది. 2024 ఎన్నికల సమీపించడంతో చిత్తూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులకు టికెట్ దక్కదని తేలడంతో ఆయన జనసేనలో చేరారు. చిత్తూరులో ఎంసీ విజయేంద్ర రెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. జంగాలపల్లె శ్రీనివాసులు తిరుపతి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
చిత్తూరులో టీడీపీ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది. ఇక్కడ మరోసారి జెండా పాతాలని నారా చంద్రబాబు నాయుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి టీడీపీ అభ్యర్ధిగా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గురజాల జగన్ మోహన్‌ను ప్రకటించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా, కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న చిత్తూరులో జనసేన మద్దతుతో విజయం సాధించాలని టీడీపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. చిత్తూరులో సీకే బాబు లేని ప్రత్యక్ష రాజకీయాలను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు. అయితే చిత్తూరులో కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముందుండి చక్రం తిప్పుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications