షాకింగ్: ఆగ్రహంతో చెప్పుతో కొట్టుకున్న టిడిపి నేత, అవాక్కయ్యారు
అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో విస్మయానికి గురి చేసే సంఘటన జరిగింది. అధికారుల తీరుపై అసహనంతో తనను తనను తానే చెప్పుతో కొట్టుకున్నాడు ఓ కార్పోరేటర్.
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో విస్మయానికి గురి చేసే సంఘటన జరిగింది. అధికారుల తీరుపై అసహనంతో తనను తనను తానే చెప్పుతో కొట్టుకున్నాడు ఓ కార్పోరేటర్.
సోమవారం నగరంలో మీ కోసం కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన 29వ డివిజన్ టిడిపి కార్పోరేటర్.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసారు.

డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, తన చెప్పుతో తాను కొట్టుకున్నాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు అవాక్కయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications