వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్ పార్టీలో 10మంది దొంగలు, అన్నొస్తున్నాడా లేక.. దొంగొస్తున్నాడా'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అక్రమంగా దోచుకున్న ప్రతి పైసా వెనక్కి తెప్పిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అక్రమంగా దోచుకున్న ప్రతి పైసా వెనక్కి తెప్పిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.

వెనక్కి తెచ్చి ఖర్చు పెడతాం

వెనక్కి తెచ్చి ఖర్చు పెడతాం

వెనక్కి తెచ్చిన జగన్ ఆస్తిని మొత్తాన్ని కూడా పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని దేవినేని చెప్పారు. వైసిపిలో పదిమంది దొంగలు ఉన్నారని ధ్వజమెత్తారు.

వైసిపికి కనబడలేదా

వైసిపికి కనబడలేదా

ప్రకాశం బ్యారేజీ ప్లీనరీ కోసం నాలుగుసార్లు తిరిగారని, అయితే అందులో పట్టిసీమ నుంచి తోడి తెచ్చిన గోదావరి నీళ్లు వారికి కనబడలేదా అని మండిపడ్డారు.

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
అన్నొస్తున్నాడో.. దొంగొస్తున్నాడో

అన్నొస్తున్నాడో.. దొంగొస్తున్నాడో

జగన్ పాదయాత్రపై మరో మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాదయాత్ర పేరుతో వచ్చేది అన్నో.. దొంగో ప్రజలకు తెలుసునన్నారు. మద్యం విషయంలో తామేదో భయపడుతున్నట్లు, జగన్‌కు భయపడి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు మాట్లాడటం సరికాదని అమర్నాథ్ రెడ్డి అన్నారు.

 ఎందుకు భయపడాలి

ఎందుకు భయపడాలి

వైయస్ హయాంలో 3 లక్షల బెల్టు షాపులు పెడితే, చంద్రబాబు సీఎం అయిన తర్వాత వాటిని 50 వేలకు తగ్గించారని అమర్నాథ్ వైసిపికి గట్టి కౌంటర్ ఇచ్చారు. దానికి భయపడాలా అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే వారిని చూసి భయపడి చేస్తున్నామని చెప్పడం విడ్డూరమన్నారు. బండి చక్రం మీద వాలిన ఈగ.. తన వల్లే చక్రం తిరుగుతోందనుకున్నట్లుగా వైసిపి తీరు ఉందన్నారు.

English summary
Andhra Pradesh Minister Devineni Umamaheswara Rao alleged that YSR Congress party have ten thieves. He said government will brought back YS Jagan's illegal assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X