కడప మీద ఫోకస్ పెట్టిన చంద్రబాబు, 47 మందిపై నిఘా పెట్టిన వైసీపీ, క్లైమాక్స్ లో ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలపై వైసీపీ అలర్ట్ అయ్యింది. వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులపై అనేక అనుమానాలు పెంచుకున్న ఆపార్టీ నాయకులు వార్త ఇప్పుడు వారితో టచ్ లోకి వచ్చారని సమాచారం. కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం జడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డిని కడప జడ్పీ చైర్మన్ అభ్యర్థి అని ఆపార్టీ నాయకులు ప్రకటించారు.

బ్రహ్మంగారిమఠం జడ్పీటీసీ సభ్యుడు రామగోవింద రెడ్డి కడప జడ్పీ చైర్మన్ గా ఎన్నిక కావడం ఆ పార్టీలోనే కొందరికి ఇష్టం లేదని తెలిసింది. ఇదే సమయంలో బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ సభ్యుడు రామగోవింద రెడ్డి ద్వారా భారీ ఎత్తున జడ్పీటీసీ సభ్యులకు నగదు పంపిణీ చేస్తున్న వైసీపీ నాయకులు ఆ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు పార్టీ పారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది

Tension among YCP leaders regarding the election of ZP chairman of Kadapa district

గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎన్నడూ లేనివిధంగా జడ్పీటీసీ సభ్యులకి ఆ పార్టీ నాయకులు నిధులు కేటాయిస్తున్నారని, వింధు భోజనాలు పెడుతున్నారని, ఒక్కొక్కరికి సుమారు పది లక్షల వరకు నిధులు కేటాయిస్తున్నారని, వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోకుండా ఆ పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జడ్పీటీసీ సభ్యుల్లో 49 మంది వైసీపీ నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. గోపవరం మంచి మాత్రమే టీడీపీ నుంచి జడ్పీటీసీ సభ్యుడు ఎన్నికయ్యారు. ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేయడంతో ఖాళీ అయ్యింది. పులివెందుల జడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి చనిపోవడంతో అది కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు మొత్తం 47 మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీలో ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ లో మొత్తం 47 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నా చైర్మన్ పదవి ఎన్నిక విషయంలో వైసీపీ నాయకులకు అనేక అనుమానాలు ఉన్నాయని వెలుగు చూసింది.

Tension among YCP leaders regarding the election of ZP chairman of Kadapa district

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జడ్పీటీసీ సభ్యులు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతారనే అనుమానంతో వైసీపీ నాయకులు బయపడిపోతున్నారని తెలిసింది. కోర్టును ఆశ్రయించి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు జరిపించాలని, ఎట్టీ పరిస్థితులో జిల్లా చైర్మన్ పదవిని వదులుకోకూడదని వైసీపీ నాయకులు నిర్ణయించారని తెలిసింది.

లేదంటే మొదటికే మోసం వస్తుందని, చాలా మంది టీడీపీలోకి జంప్ అయిపోయే అవకాశం ఉందని తెలుసుకున్న వైసీపీ నాయకులు ఆ జడ్పీటీసీ సభ్యులు పార్టీ మారకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుండి వైసీపీ టికెట్ పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే. ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజీనామాతో కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+