కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తం, దాడి: చొచ్చుకెళ్లిన ఎమ్మెల్యే

కావూరి ద్వారకా తిరుమల వెళ్లి ఇంటికి వస్తున్నారని తెలియడంతో సమైక్యవాదులు, ఎమ్మెల్యే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు. సమైక్యవాదులను పోలీసులతో పాటు కావూరి అనుచరులు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కావూరి ఇంటిలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు కలుగజేసుకొని వారిని చెదరగొట్టారు. ఎమ్మెల్యే చింతమనేని కూడా కావూరి ఇంటిలోకి దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
కావూరి సమైక్య ద్రోహి అంటూ సమైక్యవాదులు, టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో కావూరి ఇంటికి వచ్చారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసుల సహాయంతో ఆయన ఇంటిలోకి వెళ్లారు. సమైక్యవాదులు ఆయన ఇంటి వద్ద నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications