ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి-వైసిపి కార్య‌క‌ర్త‌ల ఘ‌ర్షణ : రాళ్లు..చెప్పుల తో దాడి : కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్యా య‌త్నం..!

|
Google Oneindia TeluguNews

ఒంగోలు కమ్మపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసిపి- టిడిపి కార్య‌కర్త‌ల మ‌ధ్య పెద్ద ఎత్తున ఘర్ణ‌ణ చోటు చేసు కుంది. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు చెప్పులు..రాళ్ల‌తో దాడి చేసుకున్నారు. ఓ యువ‌కుడు ఆత్మ హ‌త్యాయ‌త్నానికి పాల్ప డ్డారు. పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి రెండు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు.

క‌మ్మపాలెం లో ఘ‌ర్ణ‌ణ‌..
ఒంగోలు లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి క‌మ్మాపాలెంలో పార్టీ ఎన్నిక‌ల కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి హాజ రయ్యేందుకు సిద్ద‌మ‌య్యారు. ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు వైసిపి కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున అక్క‌డి చేరుకున్నారు . రెండు రోజుల క్రితం అక్క‌డ చోటు చేసుకున్న స్వ‌ల్ప ఘ‌ట‌న‌లు ఈ రోజు తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసాయి. బాలినేని రానీయ‌మంటూ అక్క‌డ టిడిపి వ‌ర్గీయులు ఆందోళ‌నకు దిగారు.

పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వాన్ని అడ్డుకొనేందు కు వ‌చ్చిన టిడిపి కార్య‌క‌ర్త‌ల‌కు వ్య‌తిరేకంగా వైసిపి శ్రేణులు ఆందోళ‌న‌కు దిగాయి. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు ప‌ర‌స్ప‌రం నినాదాల‌తో హోరెత్తించారు. రెండు వ‌ర్గాలు చెప్పుల‌తో ..రాళ్ల‌తో దాడులు చేసుకున్నారు. అక్క‌డ ప‌రిస్థితి ఉద్ర‌క్తంగా మార‌టంతో..అక్క‌డికి రావ‌ద్ద‌ని బాలినేని కి పోలీసులు సూచించారు. దీంతో..వైసిపి కార్య‌క‌ర్త‌లు స్థానిక టు టౌన్ పోలీస్ స్టేష‌న్ ముందు ధ‌ర్నాకు దిగారు.

కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్యా య‌త్నం..
వైసిపి ముందుగా ఏర్పాటు చేసుకున్న ర్యాలీకి అనుమ‌తి లేద‌ని చెప్ప‌టం తో అక్క‌డ ఇస్లాంపేట‌కు చెందిన సాధిక్ అనే కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు వెంట‌నే అడ్డుకున్నారు. రంగ ప్ర‌వేశం చేసిన పోలీ సులు స్వ‌ల్ప లాఠీఛార్జ్ తో అక్క‌డ రెండు పార్టీల వారిని చెద‌ర‌గొట్టారు. దీంతో..మాజీ మంత్రి బాలినేనిని అడ్డుకునేం దుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వైసిపి కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న కొన‌సాగించారు.

Tension created in Kammapalem : Stone pelting between TDp and ycp cadre

దీంతో..కొంత మంది నాయ‌కుల తో వెళ్లి పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం ముగించాల‌ని వైసిపి నేత‌ల‌ను పోలీసులు కోరారు. దీనికి వైసిపి నేత‌లు అంగీక‌రించారు. ప్ర‌స్తుతానికి ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ప్ప‌టికీ..ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల షెడ్యూల్ రాక‌ముం దే ఇక్క‌డ రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌టం తో ఇక్క‌డ అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయా ల‌ని నిర్ణ‌యించారు. అయితే, క‌మ్మ‌పాలెం లో పోలీసులు ముందుగా ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌టంలో..స‌కాలంలో స్పం దించే విష‌యంలోనూ ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Tension situation created kammaplaem in Ongole city. YCP leaders decided to open party office in that area. TDP cadre opposed that programme. Both TDP and Ycp cadre protest in front of polilce station and stone pelting on other side. Police picket started in that area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X