అద్దె చెల్లింపు వివాదం, వైసిపి ఆఫీస్‌కు తాళం: కొడాలి నాని అరెస్ట్

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భవనం ఖాళీ చేయాలని భవన యజమానులు ఆందోళన చేశారు.

దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కొడాలి నాని భవనం ఖాళీ చేయాలని యజమానులు ఆందోళన చేపట్టారు. పోలీసులు, భవన యజమానులతో ఎమ్మెల్యే కొడాలి నాని వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు నానిని అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు, కృష్ణా జిల్లా గుడివాడలోని వైసిపి కార్యాలయానికి ఉదయం భవన యజమాని తాళం వేశారు. అద్దె చెల్లింపు విషయంలో వివాదం కారణంగా తాళం వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో, వైసిపి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తాళం ఎలా వేస్తారని నాని ప్రశ్నించగా, గతంలో పలుమార్లు హెచ్చరించామని, అద్దె ఇవ్వకుంటే ఎంతకాలం ఎదురు చూడాలని ఇంటి యజమానులు చెబుతున్నారు.

పోలీసులు, ఇంటి యజమానితో గుడివాడ ఎమ్మెల్యే నాని వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని ముదినేపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు.

Tension in Gudivada YSRCP office

ఢిల్లీకి గంగిరెడ్డి

గంగిరెడ్డిని ఢిల్లీకి తీసుకొచ్చిన ఏపీ పోలీసులు

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌, అలిపిరిలో ఏపీ సీఎం చంద్రబాబుపై దాడి ఘటనలో నిందితుడు కొల్లం గంగిరెడ్డిని ఏపీ పోలీసులు ఆదివారం ఉదయం ఐవల్లీకి తీసుకొచ్చారు. ఇన్నాళ్లు అక్కడి జైల్లో ఉన్న అతన్ని మారిషస్‌ కోర్టు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమల రావు బృందానికి అప్పగించింది.

వెంటనే భారీ భద్రత మధ్య కోర్టు నుంచి విమానాశ్రయానికి తరలించారు. రోడ్డు మార్గంలో అతన్ని తరలిస్తున్నప్పుడు పైన హెలికాప్టర్‌ పహారా కల్పించారు. ఆదివారం మధ్యాహ్నం కల్లా హైదరాబాద్‌ తీసుకురాబోతున్నట్లు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. మూడు గంటలకు మీడియా ముందు హాజరు పర్చనున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+