అమరావతి పాదయాత్రలో ఉద్రిక్తత: బౌన్సర్లు, బెంజికార్లంటూ మంత్రి చెల్లుబోయిన

గుంటూరు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. అయితే, బుధవారం పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ మీదుగా వెళ్లాలని రైతులు భావించారు. అయితే, ఐతానగర్ మీదుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.

ఎమ్మెల్యే నివాసం వైపు వెళ్లొద్దంటూ రైతులకు పోలీసులు

ఎమ్మెల్యే నివాసం వైపు వెళ్లొద్దంటూ రైతులకు పోలీసులు

తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసం ఉందని, అటువైపుగా వెళ్లొద్దని పోలీసులు అభ్యంతరం చెప్పారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, స్థానిక రైతులు కూడా అమరావతి రైతులు భావించినట్లుగా ఐతానగర్ మీదుగా వెళ్లాలని పట్టుబట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది

శాంతియుతంగానే పాదయాత్ర అంటూ రైతులు

తెనాలి పట్టణంలోకి ప్రవేశించిన తమ పాదయాత్రకు ఐతానగర్ వాసులు సంఘీభావం తెలిపారని, అంతేగాక, రూ. 5 లక్షలు కూడా విరాళంగా అందజేశారని జేఏసీ నేత గద్దె తిరుపతి రావు తెలిపారు. అయితే, ఈ పాదయాత్రను తమ ప్రాంతం మీదుగా కొనసాగించాలని తమను ఐతానగర్ వాసులు కోరారని తెలిపారు. కానీ, న్యాయస్థానం ఇచ్చిన అనుమతులను ధిక్కరించకూడదనే.. పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్టాండ్ ప్రాంతం మీదుగా చినరావూరు, జంగిడిగూడెం మీదుగా సాయంత్రానికి పెదరావూరు చేరుకుంటామని ఆయన తెలిపారు. రైతులు శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను వైసీపీ సర్కారు అణిచివేస్తుందంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

బౌన్సర్లు, బెంజికార్లంటూ పాదయాత్రపై మంత్రి చెల్లుబోయిన

ఇది ఇలావుండగా, అమరావతి రైతుల పాదయాత్ర, టీడీపీపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేలా ప్రతిపక్షమైన టీడీపీ వ్యవహరిస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. ఇక్కడి రైతులతో ఒకసారి తిరుపతికి.. ఇపుడు అరసవల్లికి పాదయాత్ర చేసేలా చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారన్నారు. అమరావతిని రాజధాని చేసి తన వారి చేతే భూములు కొనిపించారని ఆరోపించారు. ఇక్కడి రైతులు అమరావతి కోసం భూములు త్యాగం చేయలేదని.. వ్యాపారం, లాభం కోసం మాత్రమే ఇచ్చారన్నారు. బౌన్సర్లు, బెంజ్ కార్లతో రైతులు పాదయాత్ర చేస్తారా? అని ప్రశ్నించారు.

కొడాలి నానిపై తప్పుడు ప్రచారమంటూ చెల్లుబోయిన ఫైర్

కొడాలి నానిపై తప్పుడు ప్రచారమంటూ చెల్లుబోయిన ఫైర్

పాలనా సౌలభ్యం కోసమే 26 జిల్లాలు చేశామని, పరిపాలన సౌలభ్యం కోసమే ఇప్పుడు మూడు రాజధానుల పెట్టాలని భావిస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. కొడాలి నానిపై టీడీపీ సోషల్ ​మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కొడాలి నాని భాషలో విపరీత అర్థాలు తీస్తున్నారన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+