గుడివాడలో ఉద్రిక్తత!

ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు.. పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ రెండు పార్టీలకు చెందిన బృందాలు ఒకర్నొకరు ఎదురుపడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎన్‌ఎస్‌జీ బలగాలను కూడా మొహరించారు.

tension in gudivada assembly constituency

చంద్రబాబుకు ఘన స్వాగతం...

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గుడివాడలో ఘనస్వాగతం లభించింది. రామనపూడి వద్ద చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఆయనకు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము, పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితర నేతలు ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబు రోడ్‌ షోకు జనం భారీ సంఖ్యలో వచ్చారు. పార్టీ శ్రేణులు భారీ ద్విచక్రవాహన ర్యాలీతో రోడ్‌షోను అనుసరించారు. అడుగడుగునా జన నీరాజనాల మధ్య చంద్రబాబుకు హారతులు, గజమాలలు, పూలతో ప్రజలు ఘనస్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+