నివురుగప్పిన నిప్పులా తాడిపత్రి.. జేసీకుటుంబం హైదరాబాద్ తరలింపు.. కడప సెంట్రల్ జైలుకు రాళ్ళదాడి నిందితులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాడిపత్రిలో నివురు గప్పిన నిప్పులా పరిస్థితి మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంతు చిక్కకుండా ఉంది. తాజాగా తాడిపత్రిలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు అక్కడ ఉద్రిక్తతలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు అన్నదానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి.
జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ కు తరలింపు
తాజాగా తాడిపత్రిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం పై పోలీసులు ఆంక్షలు అమలు చేయడం, మొదట గృహ నిర్బంధం చేసి, ఆ తర్వాత బలవంతంగా వారిని హైదరాబాద్ కు తరలించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాడిపత్రిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని నిన్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాదు వారి ఇళ్లల్లో పని చేసే పని మనుషులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

జేసీ కుటుంబం హౌస్ అరెస్ట్.. పవన్ రెడ్డితో పోలీసుల వాగ్వాదం
దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న దివాకర్ రెడ్డి, ఆయన సతీమణి, సోదరి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే జెసి దివాకర్ రెడ్డి కుటుంబాన్ని హౌస్ అరెస్ట్ చేయడం గురించి తెలుసుకున్న జేసీ తనయుడు పవన్ రెడ్డి హైదరాబాద్ నుండి నిన్న తాడిపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇంట్లోకి వెళ్లే క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులకు పవన్ రెడ్డికి మధ్య వాగ్వాదం తర్వాత పోలీసులు పవన్ రెడ్డిని ఇంట్లోకి అనుమతించారు.
జేసీ కుటుంబం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఆదేశం
ఆపై అతనిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇది అంతా జరిగిన తర్వాత గంటల వ్యవధిలోనే జెసి కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని ఊరు విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జేసీ కుటుంబ సభ్యులు ఎవరు ఉండకూడదని ఆదేశాలు ఉన్నాయని వెంటనే హైదరాబాద్ కి వెళ్ళిపోవాలని సూచించారు.
హైదరాబాద్ కు జేసీ కుటుంబం.. రాళ్ళ దాడి నిందితులు కడప జైలుకు
దీంతో జెసి దివాకర్ రెడ్డి, ఆయన సతీమణి, సోదరి, కుమారుడు జెసి పవన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమా రెడ్డి పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు వెళ్లిపోయారు.ఇదిలా ఉంటే తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడి కేసులో నిందితులను పోలీసులు ఉరవకొండ కోర్టులో హాజరుపరచగా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది . వీరందరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
రాళ్ళ దాడి నిందితులకు 14 రోజుల రిమాండ్
పోలింగ్ మరునాడు జరిగిన ఘర్షణల నేపథ్యంలో సిఐ మురళీకృష్ణ చేసిన ఫిర్యాదుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టిడిపికి చెందిన 91మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు సిఐ పైన రాళ్లదాడి చేయడంతో గాయాలయ్యాయి .దీంతో సీఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రాళ్ల దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications